నేటి నుంచి వాంఖ‌డేలో అందుబాటులోకి 'రోహిత్ శ‌ర్మ' స్టాండ్

    
ముంబ‌యిలోని ప్ర‌ఖ్యాత వాంఖ‌డే స్టేడియంలో నేటి నుంచి రోహిత్ శ‌ర్మ స్టాండ్ అందుబాటులోకి రానుంది. భార‌త్‌తో పాటు ముంబ‌యి క్రికెట్‌కు హిట్‌మ్యాన్ అందించిన సేవ‌ల‌కుగానూ ఇటీవ‌ల వాంఖ‌డే యాజ‌మాన్యం స్టేడియంలో ఓ స్టాండ్‌కు అత‌డి పేరును పెట్టి గౌర‌వించింది. అది ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్న క్ర‌మంలో ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) స్పెష‌ల్ వీడియోను ఎక్స్ (గ‌తంలో ట్విట్ట‌ర్) వేదిక‌గా షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

ఇక‌, ఇటీవ‌లే హిట్‌మ్యాన్ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌లికిన విష‌యం తెలిసిందే. గ‌తేడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన త‌ర్వాత పొట్టిఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. దీంతో ప్ర‌స్తుతం రోహిత్‌ టీమిండియా త‌ర‌ఫున బ‌రిలోకి దిగేది కేవ‌లం వ‌న్డే ఫార్మాట్‌లోనే. 2027లో జ‌రిగే వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ ల‌క్ష్యంగా అత‌డు త‌న ఆట‌ను కొన‌సాగించే ఉద్దేశంలో ఉన్నాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ 18వ సీజ‌న్‌లోనూ హిట్‌మ్యాన్ అద్భుతంగా రాణిస్తున్న విష‌యం తెలిసిందే. 


More Telugu News