మందమర్రిలో పేలిన ట్రాన్స్ ఫార్మర్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో ఇదిగో!

--
ట్రాన్స్ ఫార్మర్ లో భారీ పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడ్డ సంఘటన మందమర్రిలో చోటుచేసుకుంది. ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో ట్రాన్స్ ఫార్మర్ పేలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సోమవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద ఈ ఘటన సంభవించింది. భారీ శబ్దం వినిపించడంతో బయటకు వచ్చి చూడగా ట్రాన్స్ ఫార్మర్ మంటల్లో కాలిపోతూ కనిపించిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు.

ఈ ఘటనలో చుట్టుపక్కల ఇళ్లకు విద్యుత్ సరఫరా చేసే తీగలు కాలిపోయాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని స్థానికులు తెలిపారు. ట్రాన్స్ ఫార్మర్ పేలిపోయిందని సమాచారం అందడంతో విద్యుత్ శాఖ వెంటనే కరెంట్ సరఫరా నిలిపివేసింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న డిస్కం అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.


More Telugu News