ఇది బాహుబలి రైలు ఇంజిన్!

  • ఈ నెల చివరి వారంలో గుజరాత్‌లో పర్యటించనన్న ప్రధాని మోదీ
  • దాహోద్‌లో దేశంలో మొట్టమొదటి 9000 హెచ్ పీ లోకో మోటివ్ ఇంజన్ (బాహుబలి) ని జాతికి అంకితం చేయనున్న మోదీ
  • మేకిన్ ఇండియాలో భాగంగా దాహోద్‌లో రూ.20వేల కోట్ల వ్యయంతో పీపీపీ మోడల్‌లో ఏర్పాటు చేసిన రైల్వే ఉత్పత్తి యూనిట్ 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల చివరి వారంలో గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాహోద్‌లో దేశంలోనే మొట్టమొదటి 9000 హెచ్‌పీ లోకోమోటివ్ ఇంజిన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా దాహోద్‌లో రూ.20 వేల కోట్ల వ్యయంతో రైల్వే ఉత్పత్తి యూనిట్‌ను పీపీపీ మోడల్‌లో ఏర్పాటు చేశారు.

ఈ రైలు కర్మాగారంలో రాబోయే పదేళ్లలో దాదాపు 1,200 ఇంజిన్లను తయారు చేయనున్నారు. వీటిని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ప్రస్తుతం ఈ రైలు కర్మాగారంలో నాలుగు ఇంజిన్లు తయారవుతున్నాయి.

ఈ బాహుబలి లోకోమోటివ్ ఇంజిన్ ఏకంగా 4,600 టన్నుల గూడ్స్‌ను తీసుకువెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌లో మొదటిసారిగా లోకో పైలెట్ల కోసం ఏసీ, టాయిలెట్ సౌకర్యం కల్పించారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక వ్యవస్థ కూడా ఈ ఇంజిన్‌లో ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, మహారాష్ట్రలోని పూణేలలో ఉన్న డిపోలలో ఇంజిన్ నిర్వహణ జరుగుతుంది. 


More Telugu News