అకస్మాత్తుగా టీకొట్టు వద్ద ప్రత్యక్షమైన నారా లోకేశ్... టీడీపీ కార్యకర్త భావోద్వేగం

  • కుప్పం నుంచి కడపకు వెళ్తూ శాంతిపురంలో ఆగిన మంత్రి లోకేశ్
  • టీడీపీ కార్యకర్త చెంగాచారి టీ కొట్టును సందర్శించిన వైనం
  • కార్యకర్త యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న లోకేశ్
  • వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డానని మంత్రికి వివరించిన చెంగాచారి
  • భయపడొద్దు, నేనున్నానంటూ కార్యకర్తకు లోకేశ్ భరోసా
  • ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయాలని సూచన
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తన కుప్పం-కడప పర్యటనలో ఎదురైన ఒక సంఘటనను పంచుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా శాంతిపురంలో ఒక టీడీపీ కార్యకర్త టీ కొట్టు వద్ద తాను ఆగిన వైనాన్ని ఆయన సోషల్ మీడియాలో వివరించారు.

"కుప్పం నుంచి కడపకు రోడ్డుమార్గంలో వెళుతుండగా దారి మధ్యలో శాంతిపురంలోని టీడీపీ కార్యకర్త చెంగాచారి టీకొట్టు వద్ద ఆగాను. టీ తాగి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను. మా నూతన గృహప్రవేశం సందర్భంగా చెంగాచారి నన్ను కలిశారు. ఇప్పుడు నేను అకస్మాత్తుగా టీకొట్టు వద్ద ప్రత్యక్షం కావడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో తన టీ అంగడిని మూయించి ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదని.. తన వెంట నేనున్నానని భరోసా ఇచ్చాను. ఏ అవసరమొచ్చినా నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి ముందుకు సాగాను" అని లోకేశ్ వెల్లడించారు. ఈ మేరకు ఫొటోలు కూడా పంచుకున్నారు.


More Telugu News