'స్పిరిట్' సినిమా వివాదం.. తాను త‌ప్పుకోవ‌డానికి గ‌ల కార‌ణ‌మేంటో చెప్పిన దీపిక!

  • ప్ర‌భాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో 'స్పిరిట్'
  • ఈ మూవీలో మొద‌ట దీపికను హీరోయిన్‌గా అనుకున్న‌ సందీప్ రెడ్డి 
  • తాజాగా దీపిక‌ స్థానంలోకి త్రిప్తి డిమ్రీని తీసుకున్న వైనం 
  • దీంతో గ‌త కొద్ది రోజులుగా నెట్టింట మారుమ్రోగిపోతున్న దీపిక పేరు
  • రెమ్యునరేషన్ విష‌యమై మేక‌ర్స్‌ ఒప్పుకోక‌పోవ‌డంతోనే తాను త‌ప్పుకున్న‌ట్లు వెల్ల‌డి
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో 'స్పిరిట్' అనే సినిమా తెర‌కెక్కనున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ మూవీలో మొద‌ట దీపిక పదుకొణెని హీరోయిన్‌గా అనుకున్న‌ సందీప్ రెడ్డి.. ఆ త‌ర్వాత ఆమెను తీసేశారు. దీపిక అనేక కండిషన్లు పెట్టడం వల్లే ఆమెను సందీప్ ప‌క్క‌న పెట్టార‌నే వార్తలొచ్చాయి. తాజాగా దీపిక‌ స్థానంలోకి యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని తీసుకున్న సంగతి తెలిసిందే. 

దీనికి ప్రతి చర్యగా ఆమె పీఆర్ టీం స్పిరిట్ స్టోరీని లీక్ చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో దీపిక పదుకొణె, ఆమె పీఆర్ టీమ్‌పై సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'డర్టీ పీఆర్ గేమ్స్' అంటూ 'ఎక్స్' (గ‌తంలో ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆయ‌న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో గ‌త కొద్ది రోజులుగా దీపిక పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది.

ఈ క్ర‌మంలో తాజాగా దీపిక ఓ ఇంట‌ర్వ్యూలో స్పిరిట్ నుంచి త‌ప్పుకోవ‌డానికి గ‌ల కార‌ణమేంటో చెప్పారు. ఆమె మాట్లాడుతూ... "ఇటీవ‌ల ఓ ద‌ర్శ‌కుడు న‌న్ను క‌లిసి స్టోరీ చెప్పారు. స్టోరీ చాలా బాగా న‌చ్చింది. కానీ, రెమ్యునరేషన్  గురించి చ‌ర్చ వ‌చ్చిన‌ప్ప‌డు ఇంత చార్జ్ చేస్తా అని అన్నాను. దానికి వారు ఒప్పుకోలేదు. అందుకే నేను వారికి నో చెప్పాను. నా ట్రాక్ రికార్డ్ నాకు తెలుసు. అందుకే ఆ సినిమాకి నేను ఒప్పుకోలేదు" అని దీపిక చెప్పుకొచ్చారు. 

ఇదిలాఉంటే.. ఇప్పుడు ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో రానున్న భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఎంపికైన‌ట్టు తెలుస్తోంది. దీపిక ఈ మ‌ధ్య 'క‌ల్కి' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు బ‌న్నీతో జ‌త‌క‌ట్ట‌నున్నారు. 


More Telugu News