విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్.. నేడు మ‌న్యం జిల్లాలో ప‌ర్య‌ట‌న‌

  • మంత్రి లోకేశ్‌ స్వాగతం పలికిన ఎంపీ శ్రీభరత్, హోంమంత్రి అనిత 
  • పార్వతీపురంలో జ‌రిగే షైనింగ్ స్టార్స్ అవార్డ్-2025 కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి
  • పది, ఇంటర్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించనున్న లోకేశ్‌
  • అనంతరం పార్వతీపురం మండలం చినబొండపల్లిలో ఉత్తమ కార్యకర్తలతో భేటీ
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇందులో భాగంగా ఆయ‌న విశాఖప‌ట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఉత్తరాంధ్ర ప్రాంత పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు మంత్రి లోకేశ్‌కు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికిన వారిలో ఎంపీ శ్రీభరత్, హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నారు.  

ఉదయం 11 గం.లకు పార్వతీపురం పట్టణంలోని రాయల్ కన్వెన్షన్ లో జరిగే షైనింగ్ స్టార్స్ అవార్డ్-2025 కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. పది, ఇంటర్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరిస్తారు. అనంతరం పార్వతీపురం మండలం చినబొండపల్లిలో ఉత్తమ కార్యకర్తలతో మంత్రి లోకేశ్‌ సమావేశం కానున్నారు. ఆ త‌ర్వాత పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశంలో పాల్గొననున్నారు. 


More Telugu News