'కన్నప్ప' సినిమాను చూసిన రజనీకాంత్.. మంచు విష్ణు భావోద్వేగ పోస్టు
- 'కన్నప్ప' అద్భుతంగా ఉందని రజినీకాంత్ ప్రశంసించారన్న మంచు విష్ణు
- ఈ క్షణం కోసం 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానంటూ విష్ణు భావోద్వేగం
- జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా 'కన్నప్ప' విడుదల
మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'కన్నప్ప'. విడుదలకు ముందే ఈ చిత్రం సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ సినిమాను వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ విషయాన్ని మంచు విష్ణు సోమవారం ఉదయం తన 'ఎక్స్' ఖాతా ద్వారా వెల్లడించారు. రజనీకాంత్‌తో దిగిన కొన్ని ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు.
"రజనీకాంత్ అంకుల్ నిన్న రాత్రి ‘కన్నప్ప’ సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత ఆయన నన్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ‘కన్నప్ప’ చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. ఒక నటుడిగా ఈ క్షణం కోసం నేను 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ నెల 27న మా సినిమా విడుదల కానుంది. ఆ పరమశివుడి లీలను మీ అందరికీ చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని మంచు విష్ణు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ బాబు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, నటి కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.