యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు మంత్రి నారా లోకేశ్ అభినందనలు

  • మైరావణ’ నవలకు యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు పురస్కారం
  • ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ఎంపిక
  • విశాఖ జిల్లా మత్స్యకార గ్రామానికి చెందిన రచయిత ప్రసాద్
  • ప్రసాద్‌ను అభినందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్
  • రెండో నవలకే పురస్కారం అందుకోవడం ప్రశంసనీయమన్న మంత్రి
  • యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడిన లోకేశ్
తెలుగు సాహిత్యంలో యువ రచయిత సూరాడ ప్రసాద్ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఆయన రచించిన ‘మైరావణ’ నవలకు గాను కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్, సూరాడ ప్రసాద్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

" 'మైరావణ' నవలకు గాను కేంద్ర సాహిత్య యువ పురస్కారం అందుకున్న యువ రచయిత సూరాడ ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లికి చెందిన ప్రసాద్ గారు తెలుగుసాహిత్యంపై మక్కువతో అద్భుతమైన రచనలు చేశారు. తన రెండో నవలకే ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడం ప్రశంసనీయం. మత్స్యకార గ్రామం నుంచి ఎదిగిన ప్రసాద్ గారు తన నవలా రచనలతో యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారు. భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను" అంటూ నారా లోకేశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.


More Telugu News