కృష్ణాకు తగ్గుతున్న వరద ప్రవాహం.. శ్రీశైలం డ్యామ్ వద్ద పరిస్థితి ఇలా..
- జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 63,156 క్యూసెక్కుల వరద
- శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు 35,315 క్యూసెక్కుల నీరు విడుదల
- శ్రీశైలంలో ప్రస్తుత నీటి మట్టం 875.2 అడుగులు
కృష్ణానదికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో వరద ఉధృతి కూడా దిగుముఖం పట్టింది. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ, రేపటి నుండి తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి నిన్న లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు రాగా, ఈరోజు ఆ ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలానికి 63,156 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 875.2 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 164.7 టీఎంసీలుగా నమోదైంది.
ఈ నేపథ్యంలో అధికారులు శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం 35,315 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.