హమాస్‌ను తుడిచిపెడతాం.. వెనక్కి తగ్గేదే లేదు: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
- గాజాలో 'హమస్థాన్' ఏర్పాటు కానివ్వబోమని స్పష్టీకరణ
- 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే చెప్పిందన్న డొనాల్డ్ ట్రంప్
- యుద్ధం శాశ్వతంగా ఆపితేనే బందీల విడుదల అని హమాస్ ప్రకటన
- ఆయుధాలు వదిలి లొంగిపోవాలంటూ ఇజ్రాయెల్ కఠిన షరతు
గాజాలో హమాస్‌ను సమూలంగా నిర్మూలించడమే తమ అంతిమ లక్ష్యమని, ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు. కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "గాజాలో హమాస్ ఉండదు, హమస్థాన్ ఉండదు. ఆ సంస్థను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం" అని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు.
గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సూత్రప్రాయంగా అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో నెతన్యాహు వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో జరుగుతున్న సంధి చర్చలను హమాస్ పరిశీలిస్తున్న సమయంలోనే ఇజ్రాయెల్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరోవైపు, కాల్పుల విరమణకు తాము సిద్ధమేనని హమాస్ ప్రకటించింది. అయితే, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని శాశ్వతంగా ముగించి, తమ సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని షరతు విధించింది. అలా చేస్తే తమ వద్ద బందీలుగా ఉన్న మిగిలిన 50 మందిని విడుదల చేస్తామని హమాస్ ప్రతినిధి తాహెర్ అల్-నును తెలిపారు.
అయితే, హమాస్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. హమాస్ తమ ఆయుధాలను అప్పగించి, పాలస్తీనాను విడిచి వెళ్లడానికి అంగీకరిస్తేనే 60 రోజుల కాల్పుల విరమణకు ఒప్పుకుంటామని స్పష్టం చేసింది. యుద్ధం ముగిశాక గాజాలో హమాస్ ఉనికి కనిపించడానికి వీల్లేదని నెతన్యాహు ప్రభుత్వం చెబుతోంది.