మెడ్‌టెక్ జోన్‌కు ప్రత్యేక గుర్తింపు
- ఏపీలో తొలి నోటిఫైడ్ ఆడిటింగ్ సంస్థగా మెడ్‌టెక్ జోన్
- ఉత్తర్వులు జారీ చేసిన సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్
ఏపీ మెడ్‌టెక్ జోన్‌కు విశిష్ట గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి నోటిఫైడ్ ఆడిటింగ్ సంస్థగా ఇది గుర్తింపు పొందింది. దీని ద్వారా ఏ, బీ తరగతుల వైద్య పరికరాల తయారీ, సౌకర్యాలను తనిఖీ చేసి ధ్రువపత్రాలు జారీ చేసే నియంత్రణ సంస్థగా ఏపీ మెడ్‌టెక్ గుర్తింపు పొందింది.
ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తయారయ్యే వైద్య పరికరాలకు ఈ ధ్రువీకరణ వర్తించనుంది. ఈ సందర్భంగా మెడ్‌టెక్ జోన్ యాజమాన్యం, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జారీ చేసిన ఉత్తర్వులను, సంబంధిత ఫోటోను మెడ్‌టెక్ జోన్ సంస్థ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పంచుకుంది.