Gandhi hospital: గాంధీ ఆసుపత్రిలో తుపాకీ మిస్పైర్...కానిస్టేబుల్ ఛాతీలోకి దూసుకెళ్లిన తూటా
- శుభ్రపరుస్తుండగా మిస్ ఫైర్ అయిన తుపాకీ
- కానిస్టేబుల్ ఛాతీలోకి దూసుకెళ్లిన తూటా
- గాంధీలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలింపు...పోలీసు ఉన్నతాధికారుల పరామర్శ
నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ఈ రోజు తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఆసుపత్రి జైలు వార్డు వద్ద కానిస్టేబుల్ సాయినాథ్ తుపాకీ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఛాతిలోకి తూటా దూసుకుపోవడంతో చికిత్స నిమిత్తం అతన్ని హుటాహుటిన గాంధీలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఆసుపత్రికి వచ్చి కానిస్టేబుల్ని పరామర్శించారు. ఈ ఘటనపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.