Revanth Reddy: రేవంత్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం.. నోటీసులు జారీ!
- జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అవకతవకల కేసు
- 41 సీఆర్సీసీ కింద నోటీసులు
- ఎన్నికల బిజీ వల్ల విచారణకు హాజరుకాలేనన్న రేవంత్
ఇప్పటికే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మనుషుల అక్రమ రవాణా కేసులో రిమాండ్ కు వెళ్లారు. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత రేవంత్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. రేవంత్ కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 సీఆర్సీసీ కింద నోటీసులు జారీ అయ్యాయి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అవకతవకల కేసులో ఈ నోటీసులు జారీ చేశారు.
15 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలంటూ రేవంత్ రెడ్డి సహా 13 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు రేవంత్ స్పందించారు. తాను ఎన్నికల బిజీలో ఉన్నానని... ఈ కారణం వల్ల విచారణకు హాజరుకాలేనని పోలీసులకు లేఖ రాశారు. కేసు వివరాల్లోకి వెళ్తే, తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలను కేటాయించారనే ఆరోపణలు రేవంత్ పై ఉన్నాయి. మరోవైపు, రేవంత్ కు నోటీసులు అందడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.