Mandira Bedi: సముద్రంలో మందిరా బేడీ సాహసం... వీడియో ఇదిగో!
- మాల్దీవుల్లో విహరిస్తున్న మందిర ఫ్యామిలీ
- సముద్రంలో ఈత కొడుతూ సాహసాలు
- ఇన్ స్టాగ్రామ్ లో చిత్రాలు, వీడియో
ప్రస్తుతం తన భర్త రాజ్ కౌశల్, కుమారుడు వీర్ లతో కలిసి మాల్దీవుల్లో విహరిస్తున్న బాలీవుడ్ సెలబ్రిటీ మందిరా బేడీ, అక్కడి సముద్రంలో దూకి ఈదుతూ సాహసం చేసి, ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మాధూలోని ఓ రిసార్ట్ లో దిగిన మందిరా బేడీ, నీటి లోపల ఈదుతున్న చిత్రాలను కూడా అభిమానులతో పంచుకుంది. తన సమయం ఎంతో అద్భుతంగా గడుస్తోందని, వ్యాయామం, ఈత, సంగీతం వింటూ కాఫీ తాగడం... ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని అనిపించడం లేదని మందిర వ్యాఖ్యానించింది.