pranay: ప్రణయ్ హత్య కేసు: మారుతీరావుకు కోర్టులో చుక్కెదురు.. బెయిలు పిటిషన్ కొట్టివేత
- ప్రణయ్ హత్య కేసులో జైలు నుంచి విడుదలైన మారుతీరావు
- రాజీ కోసం ప్రణయ్ కుటుంబ సభ్యులు, కుమార్తెకు బెదిరింపులు
- మరోమారు అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు పెట్టుకున్న బెయిలు పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ప్రణయ్ హత్యకేసులో అరెస్ట్ అయిన మారుతీరావు బెయిలుపై వరంగల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఈ కేసులో రాజీ కోసం ప్రణయ్ కుటుంబ సభ్యులు, కుమార్తె అమృతను బెదిరించడంతో పోలీసులు ఆయనను మరోమారు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిలు కోరుతూ మారుతీరావు, కరీం, వెంకటేశ్వర్లు మిర్యాలగూడ జిల్లా అదనపు కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు బెయిలు అభ్యర్థనను కొట్టివేసి ఈ నెల 17కు విచారణను వాయిదా వేసింది.