Ravinder: మేడ్చల్ ఆదిత్య ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య
- హైదరాబాద్ శివార్లలో ఆత్మహత్య కలకలం
- తుపాకీతో కాల్చుకున్న ఆదిత్య ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ రవీందర్
- ఆర్థిక కారణాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్న వైనం
హైదరాబాద్ శివార్లలో ఓ ఆసుపత్రి ఎండీ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. మేడ్చల్ లోని ఆదిత్య ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ రవీందర్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం చెందారు. రవీందర్ మృతికి ఆర్థిక సమస్యలే కారణమని భావిస్తున్నారు. ఈ ఘటన మేడ్చల్ జవహర్ నగర్ లో జరిగింది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.