Sharmila: షర్మిల 'రైతు వేదన నిరాహార దీక్ష'కు పోలీసుల అనుమతి నిరాకరణ
- రైతుల సమస్యలపై షర్మిల దీక్ష
- ఇందిరాపార్క్ వద్ద 72 గంటల దీక్ష
- పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ ప్రకటన
- జిల్లాల్లోనూ దీక్ష సాధ్యం కాదని వివరణ
రైతుల సమస్యలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిర్వహించ తలపెట్టిన 'రైతు వేదన నిరాహార దీక్ష'కు పోలీసులు అనుమతి నిరాకరించారు. హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద షర్మిల 72 గంటల దీక్ష చేపట్టాలని భావించారు. ఈ దీక్ష రేపటి నుంచి షురూ చేయాలని అనుకున్నారు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని వైఎస్సార్ తెలంగా పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 9 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో అక్కడ కూడా దీక్ష చేయలేని పరిస్థితి ఉందని ఆ ప్రకటనలో వివరించారు.