Running Train: ఇన్ స్టాగ్రామ్ రీల్స్ వీడియో కోసం వేగంగా వెళుతున్న రైలు పక్కన నడిచే యత్నం... ఎలా పడిపోయాడో చూడండి!

Youth escapes life threat after he tried to walk down with running train

  • ఖాజీపేట్ వద్ద ఘటన
  • వేగంగా వస్తున్న రైలు
  • ఒక్కసారిగా పడిపోయిన యువకుడు
  • తప్పిన ముప్పు
  • వీడియో వైరల్

సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్ల కోసం యువత ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. వరంగల్ ప్రాంతంలోనూ ఓ యువకుడు ఇన్ స్టాగ్రామ్ వీడియో కోసం రిస్క్ తీసుకున్నాడు. అయితే అతడి అదృష్టం బాగుండి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. వడ్డేపల్లికి చెందిన ఓ యువకుడు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కోసం ఓ వీడియో చేసేందుకు రైల్వే ట్రాక్ ను ఎంచుకున్నాడు. 

వేగంగా రైలు వస్తుండగా, దానిపక్కనే తాను నడుస్తున్నట్టు చిత్రీకరించాలని భావించాడు. అనుకున్నట్టుగానే... ఖాజీపేట్ వద్ద ఓ రైలు వేగంగా వస్తుండగా, దానికి అత్యంత దగ్గరగా నడిచే ప్రయత్నం చేశాడు. కానీ ఆ రైలు వేగానికి యువకుడు ఒక్కసారిగా పక్కకు పడిపోయాడు. అయితే అతడికి ప్రాణాపాయం కలగకపోవడంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News