TRS: అభివృద్ధి చేసే గుర్తు కారు... అమ్ముడుబోయిన గుర్తు కమలం: మంత్రి ప్రశాంత్ రెడ్డి
- మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి
- బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపణ
- అమ్ముడుబోయిన రాజగోపాల్ రెడ్డిని తరిమికొట్టాలని పిలుపు
మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. గురువారం మునుగోడు పరిధిలోని చౌటుప్పల్ మండలం నాగారంలో జరిగిన టీఆర్ఎస్ ప్రచారానికి హాజరైన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి... బీజేపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి చేసే గుర్తు కారు అయితే... అమ్ముడుబోయిన గుర్తు కమలం గుర్తు అని ఆయన సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది సీఎం కేసీఆరేనన్న మంత్రి... డబ్బుకు అమ్ముడుబోయిన నేతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలిచారని విమర్శించారు. అమ్ముడుబోయిన రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.