Bhairi Naresh: భైరి నరేశ్ పై మరోసారి దాడికి యత్నించిన అయ్యప్ప భక్తులు
- ఏటూరునాగారంలో నరేశ్ కారు తగిలి అయ్యప్ప భక్తుడికి గాయం
- నరేశ్ ను అడ్డుకుని, దాడికి యత్నించిన భక్తులు
- పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు
గతంలో అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అయ్యప్ప భక్తులతో తన్నులు తిన్న భైరి నరేశ్ కు మరోసారి చేదు అనుభవం ఎదురయింది. ములుగు జిల్లా ఏటూరునాగారంలో నరేశ్ ను అయ్యప్ప భక్తులు అడ్డుకుని, ఆయనపై దాడికి యత్నించారు. వివరాల్లోకి వెళ్తే... ఏటూరునాగారంలోని డియర్ ఫంక్షన్ హాల్లో జరిగిన భీంరావ్ కోరేగావ్ మావేశానికి నరేశ్ వచ్చాడు. అయితే, ఆయన కారు తగిలి ఒక అయ్యప్ప భక్తుడి కాలికి గాయం అయింది. దీంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన అయ్యప్ప భక్తులు ఆయనపై దాడికి యత్నించారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.