Bhanuchandar: భానుచందర్ ఇప్పటికీ యంగ్ గా కనిపించడానికి కారణం ఇదే!
- 100% ఆకలిగా ఉన్నప్పుడు 60% మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలన్న భానుచందర్
- బాగా సంతోషం కలిగినప్పుడు ఓ గ్లాస్ తాగుతానని వెల్లడి
- హ్యాపీగా నిద్రలోనే ఎటువంటి ఇబ్బందీ లేకుండా పోవాలన్నది తన కోరికని వ్యాఖ్య
భానుచందర్ ఒకప్పటి యాక్షన్ హీరో. అప్పట్లో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చే ప్రతి సినిమాలో ఆయన కోసం ఒక క్యారెక్టర్ ఉండేది. అలాంటి భానుచందర్ ఇప్పటికీ యాక్టివ్ గానే కనిపిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యమని తరచూ చెబుతూ ఉంటారు. ఎప్పుడూ యంగ్ గా ఉండడానికి మన మనసుతో పాటు శరీరాన్ని కూడా దృఢంగా ఉంచుకోవాలన్నది ఆయన సలహా. అప్పటి నుండి ఇప్పటి వరకు తన ఆరోగ్యం కోసం తీసుకునే జాగ్రత్తలను భానుచందర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
జీవితం చాలా చిన్నదని, హ్యాపీగా నిద్రలోనే ఎటువంటి ఇబ్బందీ లేకుండా తన ఫ్రెండ్ ప్రతాప్ చనిపోయినట్లుగా చనిపోవాలనుందనీ, ఎప్పుడూ అదొక్కటే తన కోరికగా ఉంటుందని భానుచందర్ తెలిపారు.