Ram Charan: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో రామ్ చరణ్ సందడి

- కొత్త రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేసిన రామ్ చరణ్
- రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన గ్లోబల్ స్టార్
- చరణ్ రాకతో ఆర్టీఏ ఆఫీసులో భారీ కోలాహలం
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తన కొత్త రోల్స్ రాయిస్ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆర్టీఏ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్టీఏ ఆఫీసులో భారీ కోలాహలం నెలకొంది.
రామ్ చరణ్ ను దగ్గర్నుంచి చూసేందుకు జనాలు, సిబ్బంది పోటీ పడ్డారు. కాగా, రవాణా శాఖ అధికారులు చరణ్ కు సాదర స్వాగతం పలికారు. పలువురు ఉన్నతాధికారులు వచ్చి రామ్ చరణ్ ను మర్యాదపూర్వకంగా పలకరించారు. రామ్ చరణ్ తో ఫొటోలు దిగారు.
ఇక, రామ్ చరణ్ ఆర్టీఏ కార్యాలయంలో అవసరమైన లాంఛనాలు పూర్తి చేసి, కొత్త కారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాగా, రామ్ చరణ్ కొనుగోలు చేసింది రోల్స్ రాయిస్ స్పెక్టర్ మోడల్ కారు అని తెలుస్తోంది. దీని ధర రూ.7.5 కోట్ల వరకు ఉంటుంది. ఇది సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.5 సెకన్లలోనే అందుకుంటుంది.

Global Star Ram Charan Tej at Khairathabad RTA Office..#RamCharan #GameChanger pic.twitter.com/XeFj6HYdtQ
— News Wala Filmy (@NewsWalaFilmy) October 22, 2024