Hyderabad: హైద‌రాబాద్‌లో విషాదం.. శ్రీచైత‌న్య క‌ళాశాల‌లో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

Intermediate Student of Sri Chaitanya College Commited Suicide in Miyapur Hyderabad
  • మియాపూర్‌లోని శ్రీచైత‌న్య కాలేజీలో విద్యార్థి కౌశిక్ రాఘ‌వ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
  • మృతుడిది ఏపీలోని విజ‌య‌వాడ‌
  • ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్న కౌశిక్‌
  • శుక్ర‌వారం అర్ధ‌రాత్రి వ‌స‌తి గృహంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌
హైద‌రాబాద్‌లోని మియాపూర్‌లో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. శ్రీచైత‌న్య క‌ళాశాల‌లో ఇంట‌ర్‌ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏపీలోని విజ‌య‌వాడ‌కు చెందిన కౌశిక్ రాఘ‌వ (17) మియాపూర్‌లోని శ్రీచైత‌న్య కాలేజీలో ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. 

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి వ‌స‌తి గృహంలోని త‌న గ‌దిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. కుమారుడి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు, వారి బంధువులు క‌ళాశాల వ‌ద్ద‌కు చేరుకుని ఆందోళ‌న‌కు దిగారు. 

శ్రీచైత‌న్య క‌ళాశాల‌లో విద్యార్థుల‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నార‌ని, మాన‌సిక ఒత్తిడిని త‌ట్టుకోలేక విద్యార్థులు అర్థాంత‌రంగా త‌నువులు చాలిస్తున్నార‌ని న‌వ తెలంగాణ విద్యార్థి శ‌క్తి సంఘం అధ్య‌క్షుడు ప‌వ‌న్ ఆరోపించారు. కాలేజీ యాజ‌మాన్యంపై త‌క్ష‌ణ‌మే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న అన్నారు.  
Hyderabad
Intermediate Student
Sri Chaitanya College
Telangana
Suicide

More Telugu News