రేపటి నుంచి 'ఆర్సీ 16' షూటింగ్లో రామ్ చరణ్!
- రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో 'ఆర్సీ 16'
- బుధవారం నుంచి హైదరాబాద్‌లో మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్
- ఈ షెడ్యూల్లో హీరోతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ
- చెర్రీ సరసన హీరోయిన్గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్
దీనికోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను నిర్మించినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఓ ఆటతో ముడిపడి ఉన్న భావోద్వేగపూరిత కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి 'పెద్ది' అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. చెర్రీ సరసన కథానాయికగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తోంది.
ఇతర కీలక పాత్రల్లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలతో కలిసి సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ బాణీలు అందిస్తున్నారు. ఇక ఇటీవల సంక్రాంతికి రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ చరణ్ తన నటనతో అందరినీ ఫిదా చేశారు.