'స్టార్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ !
Movie Name: Star
Release Date: 2024-06-07
Cast: Kavin, Aaditi Pohankar, Preity, Lal, Kadhal Sukumar
Director: Elan
Producer: Sreenidhi Sagar
Music: Yuvan Shankar Raja
Banner: Rise East Entertainment
Rating: 2.00 out of 5
- తమిళంలో రూపొందిన 'స్టార్'
- హీరోగా నటించిన కెవిన్
- ఎమోషన్స్ కి పెద్దపీట వేసిన డైరెక్టర్
- ఇచ్చిన సందేశం మంచిదే
- కాకపోతే అందుకు తీసుకున్న సమయమే ఎక్కువ!
తమిళంలో స్టార్ డమ్ దిశగా దూసుకెళుతున్న హీరోల జాబితాలో కెవిన్ కనిపిస్తున్నాడు. 2012లో వచ్చిన 'పిజ్జా' సినిమాతో ఆయన పరిచయమయ్యాడు. అప్పటి నుంచి చిన్న చిన్న రోల్స్ చేస్తూ వెళ్లిన ఆయన, 2019 నుంచి హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'స్టార్'. ఈ ఏడాది మే 10వ తేదీన విడుదలైన ఈ సినిమా, రీసెంటుగా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది.
కలైయరసన్ ( కెవిన్) ఓ మధ్యతరగతి యువకుడు. తల్లి - తండ్రి - పెళ్లి కావలసిన ఓ అక్క .. ఇదీ అతని కుటుంబం. 'కలై'కి చిన్నప్పటి నుంచి అతనికి నటన అంటే ఇష్టం .. సినిమాలంటే ప్రాణం. అతని ఆసక్తిని గమనించిన తండ్రి (లాల్) ప్రోత్సహించడం మొదలుపెడతాడు. కొడుకు పెద్ద హీరో కావాలని ఆశపడతాడు. కాలేజ్ చదువు వరకూ వచ్చేసరికి, హీరో కావాలనే కోరిక బలపడుతుంది. అదే విషయాన్ని ఇంట్లో చెబుతాడు.
ఒక వైపున తండ్రి అనారోగ్యం .. మరో వైపున అక్కకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించవలసిన బాధ్యత. ఈ పరిస్థితుల్లో హీరో కావాలనే ఆలోచన ఏమిటంటూ తల్లి అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే నటనకి సంబంధించిన ఒక వర్క్ షాప్ ముంబైలో మొదలవుతుంది. అక్కడికి వెళితే నటనపై ఒక అవగాహన వస్తుందని భావిస్తాడు. తండ్రి కూడా అందుకు సంబంధించిన డబ్బు ఏర్పాటు చేస్తాడు.
అప్పటికే అతను మీరా (ప్రీతి) ప్రేమలో ఉంటాడు. ఆమె కూడా అతణ్ణి ఆ దిశగా ఎంకరేజ్ చేస్తుంది. అతను ముంబై వెళతాడు. అదో కొత్త ప్రపంచం. అక్కడి వర్క్ షాప్ కి వచ్చినవారిలో చాలా టాలెంట్ ఉన్నవారు ఉండటం చూసి 'కలై' ఆలోచనలో పడతాడు. వర్క్ షాప్ నిర్వాహకులు అతని నటన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. అతను ఇంటికి వెళ్లిపోవడం మంచిదని సలహా ఇస్తారు. ఆ సమయంలో కూడా తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం అతణ్ణి నిలబెడుతుంది.
అమాయకత్వం కారణంగా తన దగ్గరున్న డబ్బులు పోగొట్టుకున్న కలై, చిన్న చిన్న పనులను చేసుకుంటూ తన లక్ష్యంపైనే దృష్టిపెడతాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన అతను భవిష్యత్తు పట్ల మరింత ఆశతో ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే అతను రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. చాలా రోజల తరువాత కళ్లు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉంటాడు. తన ముఖంపై గాయం కారణంగా ఏర్పడిన 'మచ్చ'ను చూసి షాక్ అవుతాడు. ఇక ఆ 'మచ్చ' తన జీవిత కాలం ఉంటుందని తెలిసి బిత్తరపోతాడు.
హీరో కావలసిన తనకి ఇలా అయిందే అనే ఒక ఆలోచనలో నుంచి .. నిరాశా నిస్పృహలలో నుంచి అతను బయటికి రాలేకపోతూ ఉంటాడు. మీరా ఎంతగా ధైర్యం చెబుతున్నా అతను చాలా అవమానకరంగా భావిస్తూ నాలుగు గోడల మధ్యనే ఉండిపోతుంటాడు. దాంతో తీవ్రమైన అసహనానికి లోనైన మీరా అతనికి దూరమవుతుంది. తన రూపం దెబ్బతినడం వల్లనే ఆమె తనని వదిలి వెళ్లిపోయిందని భావించిన కలై ఏం చేస్తాడు? హీరో కావాలనే అతని కోరిక నెరవేరుతుందా? అనేది కథ.
ఈ సినిమాకి ఎలన్ దర్శకత్వం వహించాడు. ఇది చాలా చిన్న కథ .. చాలా తక్కువ బడ్జెట్ నిర్మించిన సినిమా. ప్రధానమైన కథ అంతా కూడా ఒక అరడజను పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. లవ్ .. ఎమోషన్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకెళ్లిన కథ. రొమాన్స్ .. కామెడీ .. యాక్షన్ పాళ్లు ఈ కథలో కనిపించవు. హీరో కావాలనే ఒక కలను నిజం చేసుకోవడం కోసం ఒక యువకుడు ఏం చేశాడనే అంశం చుట్టూనే ఈ కథ నడుస్తూ ఉంటుంది.
తనపై ఇతరులకు నమ్మకం లేనప్పుడు, తానేమిటో చూపించాలని హీరో అనుకుంటాడు. కానీ ఒకానొక దశలో తనపై తానే నమ్మకాన్ని కోల్పోతాడు. అలాంటి పరిస్థితులలో అతని మానసిక సంఘర్షణను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అయితే అందుకు అతను తీసుకున్న సమయం ఒక లోపంగా అనిపిస్తుంది. కథ చివరివరకూ హీరో సమస్యలను ఫేస్ చేస్తోనే ఉండటం ఆడియన్స్ కి అసహనాన్ని కలిగిస్తుంది.
యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. అరసు ఫోటోగ్రఫి .. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ ఓకే. జీవితంలో ఒక లక్ష్యానికి చేరుకోవడానికి ఎన్నో అవాంతరాలను అధిగమించవలసి ఉంటుంది. ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదని ఎంతోమంది మహానుభావులు నిరూపించారు. అదే విషయాన్ని ఈ దర్శకుడు తనదైన స్టైల్లో చెప్పడానికి ట్రై చేశాడు. అయితే అందుకు అతను ఎక్కువ సమయం తీసుకోవడం, మిగతా అంశాలపై దృష్టి పెట్టకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది.

Trailer
Peddinti