'రక్షణ' (ఆహా) మూవీ రివ్యూ!

Movie Name: Rakshana

Release Date: 2024-08-01
Cast: Payal Raj Puth, Manas, Rajeev Kanakala, Chakrapani
Director: Pranadeep Thakore
Producer: Yashoda Thaore
Music: Mahathi Sagar
Banner: Haripriya Creations
Rating: 2.00 out of 5
  • జూన్ 7న థియేటర్లకు వచ్చిన 'రక్షణ'
  • పోలీస్ ఆఫీసర్ గా నటించిన పాయల్ 
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్ 
  • బలహీనమైన కథాకథనాలు 
  • నిదానంగా .. పేలవంగా సాగే సన్నివేశాలు

పాయల్ రాజ్ పుత్ ప్రధానమైన పాత్రగా 'రక్షణ' సినిమా రూపొందింది. ఆమె పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమా ఇది. జూన్ 7వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అయితే పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన, ఈ సినిమా వచ్చిందనే విషయం కూడా ఆడియన్స్ కి తెలియదు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి అందుబాటులోకి వచ్చింది. ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

హైదరాబాదులో వరుసగా అమ్మాయిలు చనిపోతుంటారు. అవి హత్యలా? ఆత్మహత్యలా? అనే విషయం తేల్చుకోలేనంతగా ఉంటాయి. ఈ కేసును ఏసీపీ కిరణ్ (పాయల్)కి అప్పగిస్తారు. అలాంటి పరిస్థితుల్లోనే బస్తీకి చెందిన 'ప్రియా' అనే ఒక యువతి చనిపోతుంది. ఆ సమయంలో ఆ గుంపులో ఒక వ్యక్తి 'లాలి పాప్' ను చప్పరిస్తూ కూల్ గా ఉండటం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఆ మరుక్షణమే ఆ వ్యక్తి అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. 

జరుగుతున్నవి ఆత్మ హత్యలు కాదనీ .. హత్యలేనని కిరణ్ తన పై అధికారులకు చెబుతుంది. అయితే సరైన ఆధారాలను సంపాదించకుండానే, అవి ఆత్మ హత్యలని పై అధికారులు ఆ కేసులను క్లోజ్ చేస్తుంటారు. ఈ విషయంలో కిరణ్ ను సున్నితంగా మందలించడమే కాకుండా, సస్పెండ్ చేస్తారు. దాంతో కిరణ్ ఆలోచనలోపడుతుంది. యూనిఫామ్ లేకపోయినా, హంతకుడిని పట్టుకోవాలని నిర్ణయించుకుంటుంది.

డ్యూటీలో లేకపోయినా తాను ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం తనకి సహకరించమని ఎస్.ఐ. ప్రభాకర్ (వినోద్ బాల)ను కోరుతుంది. అందుకు అతను అంగీకరిస్తాడు. ఎలాఅంటూ యువతులను హంతకుడు ఎంచుకుంటున్నాడు? ఎలా వాళ్ల మరణానికి కారకుడు అవుతున్నాడు? చనిపోవడానికి ముందు అమ్మాయిల జీవితంలో జరుగుతున్న సంఘటనలు ఎలాంటివి? అనే విషయంపై కసరత్తి చేస్తూ వెళతారు.  

అలాంటి సమయంలోనే లోక అమ్మాయిని వేధిస్తున్న అరుణ్ (మానస్)ను మందలించి వదిలేస్తుంది. దాంతో అతను ఆమెను టార్గెట్ చేస్తాడు. అవకాశం దొరికించుకుని ఆమెను దెబ్బతీయడానికి చూస్తుంటాడు. అయితే ఊహించని విధంగా అతను చనిపోతాడు. అతను చనిపోయిన ప్రదేశంలో కిరణ్ ఉంటుంది. దాంతో అరుణ్ తండ్రి ఆమెపై కేసు పెడతాడు. 

అరుణ్ ఎందుకు చనిపోయాడు? అతని ద్వారా తనని ఎవరు టార్గెట్ చేశారు? అనే ఆలోచన కిరాను బుర్రను తొలిచేస్తూ ఉంటుంది. అమ్మాయిల సక్సెస్ ను తట్టుకోలేని ఒక వ్యక్తి జరుగుతున్న సంఘటనలకు కారణమని భావిస్తుంది. ఆ వ్యక్తి ఎవరు? అతణ్ణి పట్టుకునే విషయంలో కిరణ్ కి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనేది కథ. 

 ఇది దర్శకుడే తయారు చేసుకున్న ఒక సైకో కిల్లర్ కథ. ఒక యువతి చనిపోవడంతనే కథ మొదలవుతుంది. సైకోలను ఏదో ఒక విషయం ఇరిటేట్ చేస్తుంది. అప్పటి నుంచి వాళ్లు ఆ లైన్ కి సంబంధించిన వ్యక్తులను టార్గెట్ చేస్తూ వెళుతుంటారు. వాళ్లకి ఒక సీక్రెట్ రూమ్ .. ఆ రూమ్ లో గోడకి .. తాను టార్గెట్ చేసినవారి ఫొటోలు .. ఒక్కో ఫొటో పట్టుకుని అందుకు సంబంధించిన వారిని ఫాలో కావడం .. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. అలా వచ్చిన సినిమానే ఇది.

క్రైమ్ థ్రిల్లర్ కథల్లో రెండు వైపులా నుంచి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. హంతకుడు ఎలా హత్యలు చేస్తున్నాడు? ఎలా తప్పించుకుంటున్నాడు? అనేది మొదటిది. హంతకుదీని పట్టుకోవడానికి పోలీస్ వారు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారనేది రెండో అంశం. ఈ రెండు ట్రాకులు కూడా చాలా యాక్టివ్ గా పరిగెత్తాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందా? అనే ఒక టెన్షన్ వాతావరణం కనిపించాలి. కానీ అలాంటి హడావిడి ఎంతమాత్రం లేని సినిమా ఇది.

హంతకుడు ఎవరనేది చాలా సేపటివరకూ చూపించరు. అతను ఎవరన్నది తెలుసుకోవాలనే కుతూహలం ఆడియన్స్ లో కనిపించదు అంటే అర్థం చేసుకోవచ్చు. యువతులను .. అందులోను సక్సెస్ ను సాధించిన యువతులను హంతకుడు టార్గెట్ చేస్తున్నాడంటే, అందుకు సంబంధించిన కారణం బలమైనదై ఉండాలి. కానీ ఇంత సిల్లీ రీజన్ కోసమా ఇతగాడు ఇంతమందిని చంపింది అనిపిస్తుంది. 

అనిల్ బండారి ఫొటోగ్రఫీ .. గ్యారీ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. మహత్ స్వరసాగర్ నేపథ్య సంగీతం బాగుంది. ఈ సినిమా ఆ మాత్రం కూర్చోబెట్టాడు కారణం, ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో పోలీస్ డ్రామా కంటెంట్ లో ఉండవలసిన స్పీడ్ .. ట్విస్టులు లేకపోవడం ఈ సినిమాకి మైనస్ గా చెప్పుకోవచ్చు.

Trailer

More Movie Reviews