ట్రైబల్ ఆర్ట్, హ్యాండ్లూమ్స్ , హ్యాండీక్రాఫ్ట్ సమ్మేళంను ప్రారంభించిన మంత్రి సీతక్క
దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ట్రైబల్ ఆర్ట్, హ్యాండ్లూమ్స్ , హ్యాండీక్రాఫ్ట్ సమ్మేళం ఏర్పాటు చేయడం జరిగింది అని మంత్రి సీతక్క అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియ వారి ఆధ్వర్యంలో మేడారం మహా జాతర సందర్భంగా మేడారం హరిత హోటల్ ప్రాంగణంలోని మీటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన ట్రైబల్ ఆర్ట్, హ్యాండ్లూమ్స్ , హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పో ను రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయా(సీతక్క) ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రైబల్ ఆర్ట్, హ్యాండ్లూమ్స్ , హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పో ద్వారా శ్రీ సమ్మక్క, సారలమ్మ జాతరలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల ట్రైబల్ ఆర్ట్, హ్యాండ్లూమ్స్ , హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పో ఏర్పాటు చేసి ప్రదర్శన చేయడం జరుగుతుందని మంత్రి సీతక్క తెలిపారు.
మేడారం జాతరకు వచ్చే భక్తులను ఆకట్టుకునే విధంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన 20 మంది ట్రైబల్ కళాకారులు తయారు చేసిన దుస్తులు,వస్తువులను ఈ సమ్మేళనం లో ఏర్పాటు చేసి వాటిని అమ్మకాలకు పెట్టడం జరిగిందని తెలిపారు. సెంట్రల్ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియం లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సాంప్రదాయ సంస్కృతుల కళాఖండాలను ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు.