సింగరేణి రెస్క్యూ టీం ఆధ్వర్యంలో మేడారం జాతరలో అత్యవసర సేవలు

 తెలంగాణ కుంభ మేళా అయినటువంటి మేడారం మహా జాతరకు లక్షలాదిగా భక్తులు వారి మొక్కులు తీర్చుకోవడానికి దేశ నలు మూలల నుండి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో భక్తులు కిక్కిరిసి పోయారు. 


అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి.. క్యూలైన్లలో, గద్దెల ప్రాంగణం లో అస్వస్థతకు గురైన భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 39 మందితో కూడిన సింగరేణి రెస్క్యూ సిబ్బంది ద్వారా భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన, గాయాల పాలైన భక్తులకు ఆక్సిజన్ రిస్టర్క్టర్ , కేర్ వెంట్ ల ద్వారా అత్యవసర వైద్యం అందించి స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. వీరి సేవలను భక్తులు అభినందిస్తున్నారు. జాతర ప్రారంభం నుండి ఇప్పటివరకు దాదాపు120 మంది భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించారనీ సింగరేణి రెస్క్యూ సిబ్బంది తెలిపారు.

  

More Press News