మేడారం - వన ప్రవేశం చేసిన వన దేవతలు
బుధవారం సారలమ్మ రాక తర్వాత మహాజాతర లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు సమ్మక్కను గద్దెపైకి తీసుకురాగా.. శుక్రవారంనాడు అశేష భక్త జనం వన దేవతలకు మొక్కులు సమర్పించారు.భక్తులు పోటెత్తడంతో మేడారం జనజాతరను తలపించింది. భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి.. బంగారం తులా భారం,మొక్కులు సమర్పించారు.శనివారం ఇద్దరు తల్లులు నేటి సాయంత్రమే వన ప్రవేశం చేసారు.కన్నెపల్లికి సారలమ్మ, చిలకలగుట్టకు సమక్కలు చేరుకోవడంతో జాతర ముగిసింది .
జాతర నేపథ్యంలో.. భక్తిశ్రద్ధలతో వనదేవతలకు దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించారు. ఇవాళ సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్లారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమభరిణెతో సాయంత్రం ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత పూజారులు రాత్రి 7.27 నిమిషాలకు వన ప్రవేశం చేయడంతో జాతర ముగిసింది.