ఎక్సైజ్ ట్రైనీ సబ్ - ఇన్ స్పెక్టర్ ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్!

ఎక్సైజ్ అధికారుల శిక్షణ ను దిగ్విజయంగా పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజాసేవ చేయాలని తెలంగాణ రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ రోజు రాష్ట్ర ఎక్సైజ్ అకాడమీ లో నూతనంగా నియమించబడిన 273 మంది ఎక్సైజ్ ట్రైనీ సబ్ - ఇన్ స్పెక్టర్ ల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నేతృత్వంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్దికి నిధులు కేటాయించిందన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజాసేవలో పనిచేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో ఎక్సైజ్ శాఖ అధికారుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఎక్సైజ్ అధికారుల శిక్షణను చాలా పకడ్బందిగా తయారు చేసామన్నారు. ట్రైనీలను అన్ని అంశాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో అబ్కారి శాఖ కమీషనర్ సర్పరాజ్ అహ్మద్, అకాడమీ డైరెక్టర్ ఎన్ ఎ అజయ్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీ - 2020 ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలసి అవిష్కరించారు.

ఈ కార్యక్రమములో హైదరాబాద్ జిల్లా డిప్యూటీ కమీషనర్ సి. వివేకానందరెడ్డి, రంగారెడ్డి డివిజన్ డిప్యూటీ ఎస్ వై ఖురేషి, ఎక్సైజ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గోన్నారు.  



More Press News