దక్షిణాఫ్రికా పర్యాటకం హైదరాబాదులో ప్రత్యేక కార్పొరేట్ థింక్ ట్యాంక్ కు ఆతిథ్యం ఇస్తోంది

~ దక్షిణాఫ్రికాలో ప్రోత్సాహక ప్రయాణానికి అతిపెద్ద సహకారులలో ఒకరుగా భారతదేశం ఆవిర్భవించింది ~

 
హైదరాబాదు, మార్చ్ 2024: వార్షిక ఇండియా రోడ్ షో 2024 విజయవంతంగా పూర్తి అయిన అరువాత, దక్షిణాఫ్రికా పర్యాటకం తన ప్రోత్సాహక ప్రయాణ ప్రేరేపకము – కార్పొరేట్ థింక్ ట్యాంక్, యొక్క మూడవ సంచికను ప్రారంభించింది. ఫిబ్రవరి 2 నాడు ముంబైలో తన అరంగేట్రం తరువాత, ఈ సీరీస్ ఫిబ్రవరి 23, 2024 నాడు ఢిల్లీకి, మార్చ్ 7 న బెంగుళూరుకు మరియు మార్చ్ 15 న చెన్నై చేరుకుంది మరియు మార్చ్ 22, 2024 నాడు హైదరాబాదులో ముగిసింది. ఈ చొరవకు విజయవంతమైన ముగింపుకు గుర్తుగా, పర్యాటక బోర్డు కార్పొరేట్ కొనుగోలుదారులతో 5 నగరాలలో సమావేశాలు నిర్వహించింది.

 
దక్షిణాఫ్రికాలో ఇన్‎బౌండ్ ప్రోత్సాహక ప్రయాణాలకు సహకరించే అతిపెద్ద మార్కెట్లలో భారతదేశము ఒకటి. ఇదివరకటి ఎడిషన్స్ యొక్క విజయాన్ని ప్రదర్శిస్తూ, భారతదేశ వ్యాపారాలకు కార్పొరేట్ ప్రయాణ అవసరాలను అర్థంచేసుకొనుటకు మరియు సులభతరం చేయుటకు కార్పొరేట్ థింక్ ట్యాంక్ కార్యక్రమాలు దక్షిణాఫ్రికా పర్యాటకానికి ఒక ఆవశ్యక వేదికగా నిలిచింది. ఇటువంటి ఈవెంట్స్ ను ఏర్పాటు చేయడం అనేది పర్యాటక బోర్డు నిర్ణయం తీసుకునేవారితో కనెక్ట్ కావటానికి మరియు తన సంబంధాలను ధృఢపరచుకోవటానికి దోహదపడుతుంది. USD ($1 = 82.70 INR సుమారుగా) మరియు GBP (£1 = 105.50 INR సుమారుగా) తో పోలిస్తే, 1 ZAR విలువ కేవలం ఐఎన్‎ఆర్ 4.40 విలువతో ఆకర్షణీయమైన మార్పిడి రేట్లకారణంగా రెయిన్‎బో నేషన్ అత్యంత సరసమైన మరియు అందుబాటులో ఉండే అంతర్జాతీయ గమ్యస్థానాలలో ఒకటిగా నిలుస్తుంది. దీనికి తోడు, పర్యాటక బోర్డు ఇండియన్ కార్పొరేట్స్ ద్వారా ఇటువంటి ప్రయాణ కార్యక్రమాలపై పెరిగిన దృష్టి నేపథ్యముతో ఒక ప్రోత్సాహక గమ్యస్థానముగా దక్షిణాఫ్రికా కొరకు కనిపించే ఒక ఇష్టాన్ని గమనించింది.

 
ఎంఎస్. నెలిస్వ ఎన్కాని, హబ్ హెడ్ – మిడిల్ ఈస్ట్, ఇండియా మరియు ఈశాన్య-ఆసియా, దక్షిణాఫ్రికా పర్యాటకము చే నేతృత్వం వహించబడే కార్పొరేట్ థింక్ ట్యాంక్స్ అత్యధికంగా ఇంటరాక్టివ్ గా ఉండేందుకు మరియు ఆరోగ్యకరమైన స్వేచ్ఛా చర్చలలో పాల్గొనుటకు హాజరయ్యేవారికి ప్రోత్సహించుటకు ఎంచుకోబడ్డాయి. భారతదేశము నుండి అవుట్ బౌండ్ పర్యాటకం వీలైనంత శక్తివంతంగా మరియు సమర్థవంతంగా పనిచేస్తున్న సమయములో, ఇటువంటి సమావేశాలు త్వరిత రీకాల్ కొరకు సరైన పునాదిని ఏర్పాటు చేయడములో సహకరిస్తాయి మరియు సమావేశాలు, ప్రోత్సాహకాలు, సమావేశాలు మరియు ప్రదర్శన ప్రయాణ రంగాలలో పెరుగుతున్న డిమాండ్ పై క్యాపిటలైజ్ చేయడము లక్ష్యంగా కలిగి ఉంటాయి. సమావేశము సమయములో సంభాషణలు, కార్పొరేట్ ప్రయాణీకులకు వసతి కల్పించడం, క్లోస్డ్ డోర్ సమావేశాలు మరయు సెమినార్స్ నుండి ప్రోత్సాహక ప్రయాణాల కొరకు గమ్యస్థానము యొక్క యూఎస్‎పి వరకు దక్షిణాఫ్రికా యొక్క మౌలికసదుపాయాల నుండి భిన్నమైన అంశాలను ప్రస్తావించాయి.

 
ఎంఎస్. నెలిస్వ ఎన్కాని, హబ్ హెడ్ – మిడిల్ ఈస్ట్, ఇండియా మరియు ఈశాన్య-ఆసియా, దక్షిణాఫ్రికా పర్యాటకము  ఇలా అన్నారు, “ఈరోజు, దక్షిణాఫ్రికా భారతదేశము మరియు ప్రపంచములో అనేక దేశాల నుండి కార్పొరేట్స్ కొరకు కీలకమైన వ్యాపార ఈవెంట్స్ ను నిర్వహించడములో విలువైన మరియు ప్రాధాన్యత కలిగిన గమ్యస్థానముగా నిలిచింది. ఇటీవల విజయవంతమైన బిఆర్‎ఐసిఎస్ సమ్మిట్ కొరకు చేసిన ఆతిథ్యము భారీ సమావేశాలు మరియు సన్నిహిత కార్పొరేట్ కూటములకు అందించిన సహకారము రెయిన్‎బో నేషన్ యొక్క ప్రపంచ స్థాయి సామర్థ్యాలకు ఒక ప్రామాణికముగా పనిచేసింది.”

 
ఇంకా ఆమె ఇలా అన్నారు “భారతదేశము ఎంతోకాలంగా దక్షిణాఫ్రికాకు మిత్రరాజ్యముగా ఉంది మరియు ఈ స్నేహము ఇరు దేశాలకు ఆర్థిక ప్రయోజనాలు కలిగిన భాగస్వామ్యముగా సాకారము కావడాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. దేశము అవుట్‎బౌండ్ పర్యాటకము యొక్క నిచ్చెనను చాలా వేగంగా ఎక్కుతూ ఆసియా నుండి ప్రయాణము మరియు పర్యాటక రంగానికి ముఖ్యమైన సహకారులుగా ఆవిర్భవించింది. డిమాండ్ బలోపేతం అవుతున్న నేపథ్యములో, 2024లో భారతదేశము నుండి ఎంఐసిఈ ప్రయాణ వేగాన్ని పెంచడాన్ని కొనసాగించాలని మేము ఆశిస్తున్నాము .”

 
ప్రపంచపు అత్యంత ఉత్కంఠభరితమైన ప్రకృతి దృష్యాలు, మిలీనియల్స్ కొరకు  ఉత్సాహభరితమైన 3,000 సాహస కార్యకలాపాలు మరియు మంత్రముగ్ధులను చేసే వన్యప్రాణ ఎన్‎కౌంటర్లు వంటివాటిని దక్షిణాఫ్రికా పెంచింది. ప్రోత్సాహక ప్రయాణాలపై వచ్చే ఉద్యోగులకు, వన్యప్రాణుల సఫారీలలో సర్ఫింగ్, ప్రముఖ మార్గాలలో రోడ్-ట్రిప్పింగ్ లేదా దేశము యొక్క ప్రకృతి అందాలలో బాస్కింగ్ వంటి అనేక అవకాశాలు, అన్నీ ఒక వారములోపల, ఇవ్వబడతాయి. త్వరిత టర్న్ అరౌండ్స్ యొక్క ప్రాముఖ్యతను అర్థంచేసుకొని, దక్షిణాఫ్రికా పర్యాటకం కార్పొరేట్ వీసాలను 5-7 పనిదినాలలో ప్రక్రియపరుస్తుంది. ఈ దేశానికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది మరియు గతములో భారతదేశములో ప్రముఖ భారతీయ కార్పొరేషన్ల ఎంఐసిఈ ప్రయాణ అవసరాలను విజయవంతంగా నెరవేర్చింది.

 
దక్షిణాఫ్రికా పర్యాటకము కొరకు భారతదేశములో ఒక వ్యూహాత్మక ప్రాముఖ్యతా స్థానము ఉంది మరియు మూడు ఉత్తమ అభివృద్ధి మార్కెట్స్ లో ఒకటిగా తననుతాను బలపరచుకుంది. ఇటీవలి సంవత్సరాలలో దేశము యొక్క అభివృద్ధి చాలా దేశాలను అధిగమించింది మరియు గుర్తించదగిన లాఘవాన్ని ప్రదర్శించింది. వేగవంతమైన పురోగతులకు ప్రాతినిథ్యం వహిస్తూ, హైదరాబాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంఎన్‎సీలకు ఒక తెలివిగలిగిన గమ్యస్థానముగా ఆవిర్భవించింది. ఈ నగరము ప్రతి సంవత్సరం భారతదేశము నుండి దక్షిణాఫ్రికాకు ఇన్‎బౌండ్ ట్రాఫిక్ లో తన వంతును నిరంతరంగా అందిస్తోంది. 2023 నుండి హైదరాబాదు నుండి వచ్చిన ప్రయాణీకులలో 59% మంది తమ వృత్తిపరమైన ప్రయాణ అవసరాల కొరకు రెయిన్‎బో నేషన్ ను ఎంచుకున్నారు.

 మొత్తమ్మీద, దక్షిణాఫ్రికా గత సంవత్సరములో 79,774 భారతీయ ప్రయాణీకులను స్వాగతించింది, తద్వారా ఏటికేటి ప్రాతిపదికన భారతదేశము నుండి సందర్శకులలో 43% పెరుగుదలను గుర్తించింది. గణనీయంగా, మొత్తం ప్రయాణీకులలో 46% మంది వ్యాపార ప్రయాణాలచే ప్రేరణ పొందారు, వీరిలో ఎంఐసిఈ మాత్రమే 21% మందిని ఆకర్షించి తన అంతర్లీన సామర్థ్యాన్ని సూచించింది. ఈ వేగాన్ని మరింత ముందుకు నడిపించుటకు పర్యాటక బోర్డు ప్రాప్యతను మెరుగుపరచుటకు మరియు రెండు దేశాల మధ్య పర్యాటకాన్ని మరియు వాణిజ్యాన్ని పెంచుటకు ఎయిర్ కనెక్టివిటిని ఏర్పాటు చేసే లక్ష్యముతో సంభాషణను ప్రోత్సహించుటకు తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది. రెయిన్‎బో నేషన్ కు వచ్చే ప్రయాణీకులకు మరింత విలువ అందించే తన ప్రయత్నములో పర్యాటక బోర్డు ఇథోపియన్ ఎయిర్ లైన్స్ తో భాగస్వామ్యముతో దక్షిణాఫ్రికాకు కేవలం ఐఎన్‎ఆర్ రూ. 39,990/- తో ప్రారంభం అయ్యే రిటర్న్ చార్జీలను అందిస్తోంది.

More Press News