పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్

ప్రస్తుతం సౌత్‌లో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్. ఎస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పాన్ ఇండియన్ ప్రాజెక్టులు థమన్ చేతిలో వచ్చి పడుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల థమన్ పాటలు ఉర్రూతలూగిస్తుంటాయి. మెలోడీ, మాస్ బీట్‌లతో తమన్ శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారు. 

థమన్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారన్నది చెప్పాల్సిన పని లేదు. అలాంటి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ అద్భుతమైన మ్యూజికల్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. డల్లాస్‌లో తమన్ అతి పెద్ద మ్యూజికల్ ఈవెంట్ చేయబోతున్నారు. ఈ స్పైస్ టూర్ జూన్ 1న ప్రారంభమవుతుంది. ఈ స్పైస్ టూర్‌కు సంబంధించిన ప్రోమోలో గుంటూరు కారం నుంచి ధమ్ మసాలా అంటూ థమన్ చేసిన హంగామాను చూపించారు. 

ఇప్పటి వరకు డల్లాస్ లో జరగనంత భారీ ఎత్తున ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.




More Press News