సంయుక్త లేడి ఓరియెంటెడ్‌ చిత్రం ప్రారంభం

కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సంయుక్తమీనన్‌ నటిస్తున్న లేడి ఓరియెంటెడ్‌ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.  రాజేష్ దండా నిర్మించనున్న ఈ చిత్రానికి యోగేష్ కెఎంసి దర్శకత్వం వహించనున్నారు. 
హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి  రానా దగ్గుబాటి క్లాప్‌కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు వశిష్ట, రామ్‌ అబ్బరాజు తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, జెమినీ కిరణ్, సాహు గారపాటి, చుక్కపల్లి అవినాష్, తదితరులు పాల్గొన్నారు.

నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ “ సంయుక్త ఒకే సిట్టింగ్‌లో స్క్రిప్ట్‌కి ఓకే చెప్పి నెక్స్ట్ డే కి పూజ పెట్టుకోవడం అనేది నా కెరీర్ లో ఇదే ఫస్ట్ . అంత స్క్రిప్ట్ ఎక్సయిట్మెంట్ వున్న సినిమా ఇది. సంయుక్త ఓకే అంటేనే ఈ సినిమా చేద్దామని అనుకున్నాను.కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా సినిమాని చేయబోతున్నాం. మిగతా విషయాలన్ని టీజర్ లాంచ్ సందర్భంగా తెలియజేస్తాము' అన్నారు

దర్శకుడు యోగేష్ కెఎంసి మాట్లాడుతూ - ''ఈ కథ, చిత్రానికి రాజేష్ దండా, సంయుక్త గారు కీలకం. కథ నచ్చి వెంటనే చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఈ కథ ఎంతలా నచ్చిందని చెప్పడానికి ఉదాహరణ సంయుక్త గారు ఈ సినిమాని ప్రెజెంట్స్ చేస్తున్నారు.  సంయుక్త లాంటి గుడ్ పెర్ఫార్మర్ తోనే ఈ సినిమా చేయాలని రాజేష్ గారు నిశ్చయించుకున్నారు. ఇదంతా దైవ సంకల్పం. మిగతా విషయాలు టీజర్ లాంచ్ టైం లో చెప్తాము' అన్నారు.  

హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ '' రాజేష్  చెప్పినట్లు ఈ సినిమా ఒక మిరాకిల్ లానే జరిగింది. ఈ కథ వినాలని కొన్ని నెలలుగా అనుకుంటున్నాను. షూటింగ్ బిజీ వలన కుదరలేదు. ఫైనల్ గా రెండ్రోజుల క్రితం కథ విన్నాను, కథ అద్భుతంగా ఉంది. డైరెక్టర్ గారు కొన్ని ఇయర్స్ గా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. ఇలాంటి స్క్రిప్ట్ రావడం నా అదృష్టం. ఈ సినిమాని ఫిమేల్ సెంట్రిక్ మూవీ అని లేబుల్ చేయడం ఇష్టం లేదు. 

ఇది బలమైన మహిళా ప్రధాన పాత్రతో ఆకట్టుకునే కథ. ఫిమేల్ సెంట్రిక్ అనగానే టూ మచ్ థ్రిల్లర్ లేదా ఎంపార్మెంట్ సబ్జెక్ట్స్ వుంటాయి. మిగతా సినిమాల్లా సహజంగా ప్రజెంట్ చేసే కథలు ఎందుకు రావడలేదని భావిస్తున్నా తరుణంలో ఇలాంటి అద్భుతమైన కథ వచ్చింది. ఇందులో ఫీమేల్ లీడ్ వున్న కథే.. కానీ ఈ కథని హీరో కూడా చేయొచ్చు. అంత మంచి కథ.ఈ  స్క్రిప్ట్‌లో చాలా సామాజిక, రాజకీయ అంశాలు వున్నాయి. నెగిటివిటీ తగ్గించాలనుకున్నప్పుడు, మీరు ఎల్లప్పుడూ మ్యాన్ పవర్, ఫిజికాలిటీని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఒక స్త్రీ తనదైన రీతిలో మొత్తం నెగిటివిటీని తగ్గించే మార్గం ఉంది. ఆమె ఎలా చేస్తుంది అనేది కథ' అన్నారు



More Press News