కరోనా కట్టడికి నిరంతరం కృషి కొనసాగుతుంది: మంత్రి ఈటల రాజేందర్

  • మీడియా ఇప్పటివరకు చాలా బాధ్యతగా వ్యవహరించినందుకు ధన్యవాదములు

  • తెలంగాణలో ఇక్కడే ఉన్న వారికి ఒక్కరికి కూడా కరోనా లేదు. బయటనుంచి వచ్చిన వారికే వచ్చింది

  • మార్చ్ 2 న వచ్చిన కేసు కూడా దుబాయ్ నుంచి వచ్చారు

  • P2 : ఇటలీ నుంచి వచ్చిన అమ్మాయి

  • P3 : నేదర్లాండ్ నుంచి

  • P4 : స్కాట్లాండ్ నుంచి

  • P5 : ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ వచ్చింది

  • రాష్ట్రంలో 5 వ కారోనా పాజిటివ్ కేస్ నమోదు అయ్యింది

  • ఇప్పటి వరకు 66,182 వేల మందికి ఎయిర్పోర్ట్ లో స్క్రీన్ చేసాము

  • 464 మందికి పరీక్షలు చేశాము. అందులో కేవలం 5 మందికి మాత్రమే కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది

  • ఎయిర్ పోర్ట్ లొనే పూర్తిగా చేక్ చేసి పంపాలని కేంద్రానికి సూచించాము

  • ఆఫ్ఘనిస్థాన్, మలేసియా , యూకే, ఫిలిప్పైన్స్ నుంచి ఫ్లైట్స్ రద్దు చేశారు. రేపటి నుంచి మరికొన్ని దేశాలనుంచి వచ్చే ఫ్లైట్స్ రద్దు చేసే అవకాశం

  • వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి లక్షణాలు ఉన్నా లేకపోయినా క్వారేంటైన్ చేస్తాము

  • చైనా, ఇరాన్, ఇటలీ, జర్మనీ,కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలనుండి వచ్చినవారిని క్వారాంటెన్ సెంటర్స్ కి పంపిస్తున్నం

  • రేపటినుండి యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్ దేశాల నుండి వచ్చే వారిని కూడా క్వారంటెన్ చేస్తాము

  • విదేశాల నుంచి వచ్చే తెలంగాణ వాసులను... ఏ జిల్లా వాళ్ళను అదే జిల్లాల్లో ఉంచి క్వరంటైన్ చేసే ఆలోచనలో ఉన్నాము.ఇప్పటివరకు 221 మందిని క్వరంటైన్ వికారాబాద్, దులపల్లి సెంటర్ లలో ఉంచాము.మరో 1238 మందిని ఇంట్లోనే ఉంచి క్వారాంటైన్ చేస్తున్నాము

  • తెలంగాణ లో ప్రతి పాజిటివ్ వ్యక్తిని ట్రాక్ చేస్తున్నాం

  • పేషంట్ 1. దుబాయ్ నుండి వచ్చారు ఆయన 88 మంది నీ కలిశారు అందరికీ నెగెటివ్ వచ్చింది

  • పేషెంట్ 2 .. 42 మందిని కలిశారు కానీ ఎవరికి postive లేదు

  • P3: 69 కాంటాక్ట్స ట్రాక్ చేశాము. అందరికీ నెగెటివ్ వచ్చింది

  • p4: 11 మంది కాంటాక్ట్ వారిని చెక్ చేస్తున్నాము

  • p5: కలిసిన వారిని 11 మందికి పరీక్షలు చేస్తున్నాం. ఇంకా ఎంత మందిని కలిశారు అనేది ట్రాక్ చేస్తున్నాం

  • ఇప్పుడు రాష్ట్రంలో కారోనా పరీక్షల కోసం మొత్తం 6 ల్యాబ్స్ సిద్ధం గా ఉన్నాయి

  • గాంధీ,ఒస్మానియా, ఫీవర్ ఆస్పత్రి , ఐ పీఎం, ఎంజీఎం లతో పాటు నిమ్స్ లో కూడా ల్యాబ్స్ ని సిద్ధం చేస్తున్నాము

  • ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ లోకి ప్రజలు వచ్చే ప్రతి మార్గం లో జాగ్రత్తలు వహిస్తున్నాము

  • దులపల్లి, వికారాబాద్ లో ధర్నా చేస్తున్న వారికి ఒకటే విజ్ఞప్తి...అక్కడికి తీసుకు వస్తున్న వారు కరోనా పేషెంట్స్ కాదు. భయపడాల్సిన అవసరం లేదు

  • బాధ్యత గల నేతలు ఇలాంటి సమయంలో ప్రజలను భయపెట్ట వద్దు

  • విదేశాల నుండి వచ్చే వారు కొంతమంది ఇంట్లోనే క్వారెంటైన్ ఉంటామని అడుగుతున్నారు ఆ విషయం పరిశీలిస్తాం

  • సీఎం కెసిఆర్ గారు అసెంబ్లీ వేదికగా కరోనా వైరస్ వ్యాప్తి పై భయపడవద్దు అని భరోసా కల్పించారు. ప్రభుత్వం ప్రజలవెంట ఉంది అని విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు. ఎంత డబ్బు అయిన ఖర్చు పెడతా అన్నారు. సీఎం గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. వైరస్ వ్యాప్తి ని అరికట్టెందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు

  • కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ యోగితా రానా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


More Press News