కొంపలు మునిగినట్టు ఇళ్ల నుండి ఎందుకు అందరూ బయటికి వస్తున్నారు: మంత్రి ఈటల ఆగ్రహం
విదేశాల నుండి వచ్చిన వారికి సోయి ఉండాలి
కరోనా తీవ్రత తెలిసి కూడా ఇంట్లో ఉండాల్సిన వారు బయట తిరగడం మంచిది కాదు. తెలివి లేదా? నేరం కాదా?
Dsp మీద కేసు పెడతాం
కరోనాను అహ్వానిద్దమా ? తరికొడదామా ?
ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం.. ఈటల రాజేందర్, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
క్వారంటైన్ లో ఉండాల్సిన వాళ్ళు రోడ్డు మీదకి రావడంపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలలో చదువుకొనే వారు, ఉద్యోగాలు చేసుకొనేవారు సోయి లేకుండా ప్రవర్తించడం సరికాదు అన్నారు. ప్రభుత్వం చెప్పే మాటలు పెడచెవిన పెట్టీ పక్కన వారికి అంట పెట్టడం కరెక్ట్ కాదు అని అన్నారు. చెప్పినా వినని వారిని ఊపెక్షించం, కేసులు పెడతాం అని మంత్రి అన్నారు. ప్రజల బాగు కోసం ఆర్దికంగా రాష్ట్రం ఎంత నష్టపోయిన పర్లేదు అని మనిషి ప్రాణం ముఖ్యం అని సీఎం కె చంద్రశేఖర్ రావు తెలంగాణ షట్ డౌన్ ప్రకటించారు. ఆ తీవ్రతను పట్టించుకోకుండా ఏదో కొంపలు మునిగిపోయినట్టు అందరూ బయటికి రావడం సరికాదు అని మంత్రి అన్నారు.
బయటికి వచ్చి వైరస్ ను ఆహ్వానిద్దామా ? మనకు మనం కట్టుబాటుతో ఉండి వైరస్ ను అరికడదామా ? తేల్చుకోండి అని ప్రజలకు మంత్రి పిలుపు ఇచ్చారు. గాంధీ, ఒస్మానియా హాస్పిటల్ లో రొటీన్ చెక్ ఉప్ కి రావద్దు అని ప్రజలను కోరారు. అత్యవసర పరిస్థితి ఉంటేనే హాస్పిటల్స్ కి రావాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కెసిఆర్ గారి విజ్ఞప్తి మేరకు కేంద్రం అంతర్జాతీయ విమానాలు కేంద్రం నిలిపి వేసింది. ఇప్పుడు విదేశాలనుండి కరోనా వైరస్ వచ్చే అవకాశం లేదు. దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల నుండి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తెలంగాణ కి వచ్చే అన్ని దారులు మూసి వేశాం.. డొమెస్టిక్ ఫ్లైట్స్ లో వచ్చే వారిని కూడా స్క్రీన్ చేయాలని సీఎం గారు ఆదేశించారు అని మంత్రి తెలిపారు.
తెలంగాణలో 6 లాబ్స్ కి అనుమతి వచ్చింది. సీసీ ఎంబి కూడా అందుబాటులోకి వస్తే రోజుకు లో 1600 మందికి టెస్టులు చేయొచ్చు. తెలంగాణలో కరోనాతో ఒక్కరు చనిపోలేదు.. 33 పాజిటివ్ కేసుల్లో ఎవ్వరికీ సీరియస్ లేదు అని మంత్రి తెలిపారు. ఇటలీ అనుభవాల తర్వాత వైరస్ సోకిన తర్వాత ట్రీట్మెంట్ కన్నా ముందే ఆరికట్టడం ముఖ్యం అని తెలిసివచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేని అసాధారణ నిర్ణయాలు తప్పటం లేదు.. 31 వరకు ఇళ్ళల్లోనే ఉండాలి.. అన్నిటికంటే ప్రాణం ముఖ్యం అని మంత్రి అన్నారు. 97 మంది కరోనా అనుమానితులు ఉన్నారు. హాస్పిటల్స్ లో ఉన్నారు, వారందరికీ పరీక్షలు చేస్తున్నాం. ప్రస్తుత 33 కేసుల్లో 31 బయటి దేశాలకు వెళ్లిన వారు.. ఇద్దరికి ప్రైమరీ కాంటాక్ట్ వల్ల వైరస్ సోకింది. ఒకరు హైదరాబాద్ మరొకరు కరీంనగర్ కి చెందిన వారు. ఇది ఇక్కడితో ఆగాలని ఆశిస్తున్నామని మంత్రి అన్నారు.
క్వారంటైన్ లో ఉన్న వాళ్ళను బయటకి రానివ్వద్దు.. బయటకి వస్తే చర్యలు తప్పవు అని మంత్రి స్పష్టం చేశారు. ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఒక DSP మీదనే కేసు పెట్టాం అంటే అర్దం చేసుకోండి. ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళతో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అస్సోషియేషన్ తో చర్చలు జరిపినం. ఎలాంటి పరిస్థితి అయిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము అని మంత్రి అన్నారు. ముందస్తు ఏర్పాట్లకు ఎలాంటి లోటు లేదు అని మంత్రి అన్నారు. నిత్యావసర వస్తువులకు ఎలాంటి కొరత లేకుండా చూస్తామని కూరగాయల దుకాణాలు, చికెన్, మటన్ దుకాణాలు తెరిచి ఉంటాయని మంత్రి తెలిపారు. సరుకుల రవాణా, పశువుల దాణా, కోళ్ల దాణా రవాణా, తయారు కేంద్రాలు నడుస్తాయి అని వాటిని పోలీసులు ఆపవద్దని ఇప్పటికే GO ఇచ్చామని మంత్రి తెలిపారు.