ప్రగతి భవన్ లో ప్రత్యేక హ్యాండ్ వాషింగ్ కార్యక్రమం.. పాల్గొన్న మంత్రులు, అధికారులు!
వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రగతి భవన్ లో ప్రత్యేక హ్యాండ్ వాషింగ్ కార్యక్రమం చేపట్టారు. ప్రగతి భవన్ లోకి వచ్చే ముందు చేతులు కడుక్కోవడానికి రెండు పెద్ద గంగాళాల్లో నీళ్లు పెట్టారు. మంత్రులు, సీనియర్ అధికారులు కార్యాలయంలో వచ్చే ముందే అక్కడ చేతులు కడుక్కుని, శానిటైజర్ తో శుభ్రపరుచుకురావాలనే నిబంధన పెట్టారు. దీంతో మంగళవారం నాటి అత్యవసర, అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రులు, ఇతర అధికారులు, బయట నీళ్లు, సబ్బుతో చేతులు కడుక్కొని లోపలికి ప్రవేశించారు. ప్రతీ ఇంట్లో, ప్రతీ కార్యాలయంలో కూడా ఇలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.