వ్యవస్థలను విధ్వంసం చెయ్యాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు: ఏపీ మంత్రులు
- కనపడని శత్రువుతో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంది
- చంద్రబాబు హోమ్ క్వారంటయిన్ లో ఉండి ఉత్తరాలు రాస్తున్నారు
- ఏపీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు
మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్:
- పేదలకు సాయం చేయాలని నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నాం.
- ప్రభుత్వంపై బురద చల్లాలని చంద్రబాబు లేఖలు రాస్తున్నారు.
- కరోన వైరస్ ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు.
- బీజేపీ, సీపీఐ, జనసేన,పార్టీలు చంద్రబాబు తోక పార్టీల మాదిరిగా వ్యవహరిస్తున్నాయి.
- కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవడానికి మంత్రులు ముందుకు వస్తున్నారు.
- ఒక్కో నియోజకవర్గంలో 40 వేల మందికి నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేస్తున్నాం.
- సోషల్ డిస్టన్స్ ద్వారా ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నాం.
- కరోన పోరులో ప్రజలకు వైద్యంతో నిత్యావసర వస్తువుల పంపిణీ కూడా చాలా అవసరం.
- చంద్రబాబు ఇంకా భ్రమలో ఉన్నారా లేకా నైజం అలా ఉందొ అర్థం కావడం లేదు.
- వ్యవస్థలను విధ్వంసం చెయ్యాల్సిన అవసరం ప్రభుత్వానికి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదు.
- ఆర్ధిక వ్యవస్థను విధ్వంసం చేసి చంద్రబాబు నీతులు చెప్తున్నారు.
- విపత్కర పరిస్థితిలో మీ పాలన ఎలా ఉందో ఉత్తరాంధ్ర ప్రజలు చెప్తున్నారు.
- టీడీపీ అధికారంలో ఉండగా టమాటకు గిట్టుబాటు ధరలు కల్పించారా అని ప్రశ్నించారు.
- నష్టం వచ్చిన మొక్కజొన్న, జొన్న, రబి, టమాటా, అరటి కొనుగోలు చెస్తున్నాం.
- కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి న్యాయం చెయ్యమని చంద్రబాబు ఎందుకు లేఖ రాయడం లేదు.
- పోస్టు కార్డుల ఉద్యమంలాగా చంద్రబాబు లేఖలు రాస్తున్నారు.
- విపత్తులు వస్తే రాజకీయ రాబంధులాగా ఆనంద పడుతున్నారు.