హైదరాబాద్ నుండి మహాబుబ్ నగర్ కు నిత్యావసర వస్తువుల పంపిణీ.. జెండా ఊపి ప్రారంభించిన తెలంగాణ మంత్రి
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కరోనా మహమ్మారి నియంత్రణ లో భాగంగా లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేందుకు హైదరాబాద్ నుండి మహాబుబ్ నగర్ కు వెళుతున్న రవాణా వాహనాలను హైదరాబాద్ లోని కాచిగూడ లోన్న టూరిస్ట్ ప్లాజా హోటల్ వద్ద జెండా ఊపి తరలించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు లాక్ డౌన్ వల్ల సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రజల వద్దకు నేరుగా సరుకులు పంపిణీ ని చేపడుతున్నామన్నారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు గుంపులు గుంపులుగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలన్నారు. ప్రజల కోసం మోబైల్ ATM లు, మొబైల్ రైతు బజార్ లను ఉపయోగించుకోవలన్నారు. కరోనా వైరస్ నియంత్రణ చేయాలంటే ప్రజలు సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలను ఆదుకుంటున్నామన్నారు. వలస కూలీల కోసం దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తోందన్నారు. మహబూబ్ నగర్ నుండి వివిధ రాష్ట్రాల కు వలస వెళ్లిన ప్రజలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వెనక్కి పంపిస్తున్నారు. కరోనా మహమ్మారి నిర్ములన లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలందరూ లాక్ డౌన్ ను పాటిస్తూ ఇండ్లలోనే స్వీయ నియంత్రణ, సామజిక దూరాన్ని పాటిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన నియమ నిబంధనలకు లోబడి సహకరించాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ వల్ల దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సాదించని విధంగా ఆహార పదార్థాల ఉత్పత్తి లో స్వయం స్వావలంబన సాధించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ సీజన్ లో రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో ధాన్యం ఉత్పత్తి సాధించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు. మన రాష్ట్రం తో పాటు రెండు మూడు రాష్ట్రాలకు సరిపడేవిధంగా ఆహార పదార్థాల ఉత్పత్తి జరిగిందన్నారు.
లాక్ డౌన్ వల్ల సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించేందుకు దాతలు, NGO లు ముందుకు రావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లెజెండ్ కు చెందిన ప్రతినిధులు నాగేశ్వరరావు, ప్రతాప్ జడేజా, ఆశిష్ లు పాల్గొన్నారు.