4.42 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పండ్ల తోటలు సాగులో ఉన్నాయి: తెలంగాణ మంత్రి
తెలంగాణలో సుమారుగా 4.42 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పండ్ల తోటలు సాగులో ఉన్నాయి. వీటి ద్వారా రమారమి 25.69 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు ఉత్పత్తి అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ,సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటన లో సిట్రస్ జాతి(బత్తాయి, నిమ్మ), మామిడి పండ్లు వినియోగించడం వలన ఆరోగ్య రీత్యా కలిగే ప్రయోజనాలు, లభ్యత గురించి వివరించారు.
మొత్తం పండ్ల విస్తీర్ణంలో మామిడి 3.07 లక్షల ఎకరాలలో సాగు అవుతూ మొదటి స్థానంలో ఉండగా, బత్తాయి పంట సుమారు 62,000 వేల ఎకరాలలో సాగు అవుతూ రెండవ స్థానంలో ఉన్నదని, అంతేకాకుండా, నిమ్మ, దానిమ్మ, పుచ్చకాయ, బొప్పాయి, జామ, ద్రాక్ష మొదలగు పండ్లు కూడా మన రాష్ట్రంలో పండిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మనకు విరివిగా లభించే పండ్ల రకాలైన మామిడి, బత్తాయి, బొప్పాయి, జామ, నిమ్మ మొదలైన వాటిలో విటమిన్ ఎ, బి, సి, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వలన మనకు కావలసిన పోషక విలువలను అందించడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయని, భారతీయ వైద్య పరిశోధన సంస్థ (ICMR) వారి సిఫార్సుల మేరకు ప్రతిఒక్క మనిషి కనీసం రోజుకి 100 గ్రాముల పండ్లు తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాహార విలువలు సమపాళ్లలో అంది ఆరోగ్యవంతంగా ఉంటారని తెలపడం జరిగిందని అన్నారు. ఈ అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సగటున ప్రతి మనిషి నెలకు 3 కిలోల పండ్లు తినాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ,సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు నిర్వహించిన సర్వే ప్రకారం రోజుకి 99 గ్రాములు అంటే 2.97 కిలోల పండ్లు వాడుతున్న ప్పటికీ బత్తాయి, నిమ్మ, మామిడి పండ్లతినడంవలన కలిగే ప్రయోజనాల పై ప్రజలలో అవగాహన లేక పోవడం వలన వీటి వాడకం తక్కువగా ఉన్నట్లు గమనించడం జరిగింది. ఉదాహరణకు బత్తాయి కేవలం నెలకు 140 గ్రాములు, మాత్రమే తింటునట్లు సర్వే తెలియడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా సిట్రస్ జాతిపండ్లయిన బత్తాయి, నిమ్మ, మామిడి లో విటమిన్-సి పుష్కలంగా ఉండటం వలన, వీటిని తీసుకోవడం ద్వారా మనకు అవసరమైన రోగనిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని మంత్రి తెలిపారు.
బత్తాయి రసంలో పోషక విలువలతో పాటు ఔషధ పరంగా కూడా అనేక లాభాలు ఉన్నాయి, బత్తాయిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది, పీచు పదార్ధాలు, జింక్, కాపర్, ఐరన్, కాల్షియం వంటివి దాగివున్నాయి, క్యాలరీ లు, ఫ్యాట్ కూడా తక్కువని మంత్రి అన్నారు. బత్తాయి పండును చాలా మంది ఒలుచుకొని తిన్నప్పటికి జ్యూస్ రూపంలోనే దీని వాడుక ఎక్కువ అని, ప్రతి 4 బత్తాయి పండ్లకు ఒక గ్లాసు (200 ml) బత్తాయి రసం తీయవచ్చునని తెలిపారు. ఈ ప్రకారంగా ప్రతి ఇంట్లో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఒక గ్లాసు బత్తాయి రసం సేవించినచో తలసరి పండ్ల వినియోగం పెరగడంతో పాటు పోషక విలువలు, రోగనిరోధక శక్తి కలిగి ఉండటమే కాక మన రైతుల యొక్క పంటను మనమే వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుందని మంత్రి తెలిపారు. 200 గ్రాముల బత్తాయి లేక ఒక గ్లాస్ జూసు శరీరానికి శక్తిని, సరిపడ పోషకాలను అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ,సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి వివరించారు.
నిమ్మ కాయల్లో విటమిన్ సి, పీచు పదార్ధాలు ఇతర పోషకాలు ఎన్నో ఉంటాయి. గుండె ఆరోగ్యానికి బరువు నియంత్రణకు జీర్ణకోశ ఆరోగ్యానికి నిమ్మ మేలు చేస్తుంది. ఒక్క నిమ్మ కాయలో 30 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది మనిషికి అవసరమయ్యే విటమిన్ సి లో సగానికి పైగా పొందవచ్చునని, కొలస్ట్రాల్ తగ్గించడంలో, కిడ్నీలో ఉన్న రాళ్లను కరిగించడలో నిమ్మ ఎంతగానో ఉపకరిస్తుందని, రోగ నిరోధక శక్తి ని పెంచడానికి, జలుబు, స్కర్వీ (విటమిన్ సి తగ్గినప్పుడు వచ్చేది) వ్యాధి నివారణకు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.
మామిడి పండు రేచీకటి , జలుబు దగ్గు వంటి వ్యాధులకు దివ్య ఔషదం, ఊపిరితిత్తుల రోగాలు రాకుండా కాపాడుతుందని, అధిక మోతాదులో ఉన్న పీచు పదార్ధం, విటమిన్ సి, పెక్టిన్ తో బాటు కరోటి నాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు తో మామిడి పండ్లు తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. మామిడి పండ్ల ముక్కలు, పండ్ల రసం, పచ్చళ్లు, మామిడి తాండ్ర, వొరుగులు, ఆంచూర్ మొదలగునవి చేసుకొనవచ్చని. తద్వారా సంవత్సరం పొడుగునా కావలసిన పోషకాలు మామిడి నుండి పొందవచ్చని, 250 గ్రాముల మామిడి పండ్లు శరీరానికి కావల్సిన శక్తిని, పోషకాలను అందిస్తుందని మంత్రి తెలిపారు.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 24.03.2020, 27.03.2020 న ఏర్పాటు చేసిన పత్రికా సమావేశాలలో ఈ పండ్లలో ఉన్నటువంటి పోషకాహార విలువలు (విటమిన్లు, ఖనిజ లవణాలు) లభ్యతను ప్రస్తావిస్తూ కోవిడ్-19 లాంటి వైరస్ ఎదుర్కోవడానికి పండ్లను విరివిగా వినియోగించాలని ప్రజలను కోరడం అయినదని. అంతే కాకుండా మన రాష్ట్రంలో పండించే బత్తాయి, నిమ్మ, మామిడి పండ్లను మన రాష్ట్ర ప్రజలే వినియోగించుకుని తద్వారా రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. మనరాష్ట్రంలో ప్రస్తుతం బత్తాయి, నిమ్మ,మామిడి,పుచ్చకాయ లభ్యమవుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో బత్తాయి సుమారు 70 వేల టన్నులు, నిమ్మ 1.22 లక్షల టన్నులు, మామిడి 3.5 నుండి 4 లక్షల టన్నుల ఉత్పత్తి రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
పై ఆదేశాలకు అనుగుణంగా బత్తాయి, నిమ్మ, మామిడి రైతులు పండించిన పంటను ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు జిల్లా కలెక్టర్లు, పోలీస్ శాఖ వారి సహకారంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించి హైదరాబాదులోని 10 రైతు బజార్లు 3 మార్కెట్ల నుండి 260 మొబైల్ రైతు బజార్ల ద్వారా పండ్లు, కూరగాయలు 500 ప్రాంతాలలోని ప్రజానీకానికి సరఫరా చేయడం జరుగుతున్నదని మంత్రి అన్నారు. అయితే ఇంకా ప్రజలలో పండ్ల వినియోగం పై ముఖ్యంగా బత్తాయి, మామిడి తినడం కలిగే ప్రయోజనాల పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
మన రాష్ట్ర లో ఏప్రిల్ – మే నెలలలో లభ్యం అయే బత్తాయి, మామిడి ఉత్పత్తి ని మన రాష్ట్ర జనాభా పూర్తి స్థాయి లో రోజు (సుమారు 45 రోజుల పాటు) వినియోగించినట్లయితే ఒక్కొకరికి సుమారు 225 గ్రాముల మామిడి, 38 గ్రాముల బత్తాయి అందుబాటులో ఉంటుందని అంచనా అని, ఈ పండ్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రం లో పండ్ల తలసరి వినియోగం పెరిగినట్లయితే మన రాష్ట్రం లో పండే పండ్లను మనమే వినియోగించడంమే కాకుండా మన రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడినట్లు అవుతుందని రాష్ట్ర వ్యవసాయ,సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి వివరించారు.
రోగనిరోధక శక్తి ని కలిగివున్న మామిడి, బత్తాయి, నిమ్మ వంటి పండ్లను అధికము గా వినియోగించడం, రోజు వారి ఆహారం లో భాగంగా చేసుకోవలసింది గా రాష్ట్ర వ్యవసాయ,సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను కోరారు.