బాన్సువాడ పట్టణంలో పర్యటించిన తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం

కామారెడ్డి జిల్లా: కరోనా వైరస్ నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడానికి బాన్సువాడ పట్టణంలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈరోజు జిల్లా కలెక్టర్ డా. ఎ. శరత్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, ఇతర అధికారులు, ముఖ్యమైన ప్రజాప్రతినిధులతో కలిసి బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రహదారి, కాలనీలలో పర్యటించిన స్పీకర్ పోచారం.

ఈ సందర్భంగా కాలనీలలో స్పీకర్ మాట్లాడుతూ... సమర్ధవంతమైన చర్యలతో బాన్సువాడ పట్టణంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టగలిగామని అన్నారు. ఇదే విధంగా లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసినా పోచారం, అత్యవసరమైన పని ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. బయటకు వచ్చినా మాస్క్, ఇతర రక్షణ పరికరాలు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించిన స్పీకర్.

ప్రజల రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన స్పీకర్ పోచారం. విధుల నిర్వాహణలో అధికారులు అప్రమత్తంగా ఉండి, నిక్కచ్చిగా వ్యవహరించాలని అధికారులకు సూచించిన స్పీకర్ పోచారం.

ఈ సందర్భంగా పోచారం ట్రస్ట్ ఆధ్వర్యంలో బాన్సువాడ మున్సిపాలిటీకి అందించిన బూమ్ స్ప్రేయర్ యంత్రాన్ని పరిశీలించిన స్పీకర్ పోచారం. అదే విధంగా పోచారం ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అందజేస్తున్న నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన పోచారం.

బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండల కేంద్రం, కోటగిరి మండలంలోని పోతంగల్, కోటగిరి, రాయకూర్ గ్రామాలలో సన్ ఫ్లవర్ గింజల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పోచారం శ్రీనివాస రెడ్డి. పాల్గొన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి.

More Press News