రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో కరోనా వైరస్ వ్యాప్తికి ఆస్కారం వుంటుంది: గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్
రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో కరోనా వైరస్ వ్యాప్తికి ఆస్కారం వుంటుందని గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ శ్యామ్ సుందర్ రాజు తెలిపారు. కోవిడ్-19 పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ వైద్యులు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్యామ్ సుందర్ రాజు మాట్లాడుతూ, ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ తో వ్యాప్తిని చాలా వరకు అరికట్టగలుగుతున్నామన్నారు. వైరస్ తగ్గాలంటే సోషల్ ప్రివెంటివ్ మెథడ్స్, మెడికేషన్ ,వాక్సినేషన్ లాంటివి మార్గాలు ఉన్నాయి అన్నారు.సోషల్ ప్రివెంటివ్ మెథడ్స్ లో భౌతిక దూరం పాటించడం,చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవడం,లాక్ డౌన్, మాస్క్ ధరించడం లాంటివి సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. వాక్సినేషన్ కు సంబంధించి పరిశోధనలు జరుతున్నాయి అన్నారు.
కేర్ ఆసుపత్రి కన్సల్టెంట్ డాక్టర్ నవోదయ్ మాట్లాడుతూ చలి కాలంలో వచ్చే ఫ్లూ లాంటి లక్షణాలతో కరోనా కూడా వస్తుందన్నారు.ముఖ్యంగా భౌతిక దూరాన్ని పాటిస్తూనే చేతులను శుభ్రపరచడం అలవాటు చేసుకోవాలన్నారు. లక్షణాలు ఉంటే వెంటనే గుర్తించి డాక్టర్ సలహా తీసుకోవాలన్నారు. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు జింక్, ఐరన్ , సెలీనియం, విటమిన్ ఎ, డి, ఈ, సీ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలన్నారు.తక్కువ నూనెలను వాడుతూ ఎక్కువ మంచినీటి ని తీసుకోవాలని సూచించారు.ప్రతిఒక్కరు సరిపడా నిద్ర పోవాలన్నారు.వయసు పై పడిన వాళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేడి నీటితో గర్గ్లింగ్ చేయాలన్నారు.సరుకులను బయట నుండి తీసుకువచ్చినప్పుడు వాటిని కడిగి , కొంతసేపు బయట పెట్టి వాడుకోవాలన్నారు.ప్రజలు లాక్ డౌన్ ను తప్పక పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే , జాయింట్ డైరెక్టర్ జగన్, ఇంచార్జి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ విజయభాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ యామిని తదితరులు పాల్గొన్నారు.