కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించిన మంత్రి ఈటెల రాజేందర్

గురువారం తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ లు కన్నెపెళ్లి (లక్ష్మి) పంపు హౌస్ ను సందర్శించి పంప్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుండి మంత్రులు, అధికారుల బృందం కన్నెపెల్లికి చేరుకోగా హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ లు మంత్రి, అధికారుల బృందానికి స్వాగతం పలికారు. అనంతరం కన్నెపల్లి పంప్ హౌస్ లో నిర్మాణంలో ఉన్న వివిధ మిషనరీల పనులను పరిశీలించగా కాలేశ్వరం ఇఎన్సి నల్లూ వెంకటేశ్వర్లు కన్నెపల్లి పంప్ హౌస్ నిర్మాణ పనులపై వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికే అన్నపూర్ణ లాంటిదని, నిర్ధేశిత లక్ష్యం మేరకు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని తరలించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పనులు చేపట్టడం జరిగింది. కరోనా లాక్ డౌన్  నేపథ్యంలో నిలిచిపోయిన పనులు, మిషనరీలు రావడానికి ఇబ్బంది కలగడంతో పెండింగ్లో ఉన్న పనులను లాక్ డౌన్ ఎత్తి వేయగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులను వేగంగా చేపట్టి వానాకాలం పంట నాటికి పూర్తిస్థాయిలో నీటిని తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు సందర్భంగా కోత విధించకుండా అధికారులు పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీంను ఆదేశించారు. ఇప్పటికే అధికారులతో సమీక్షలు నిర్వహించి, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి వరి ధాన్యం కొనుగోలులో కోత లేకుండా చర్యలు చేపట్టామని అదే విధంగా జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో ఇద్దరికీ నయమై గాంధీ ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చారని,ఒక్కరు గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని, జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక్క కంటైన్మెంట్ జోన్ ను కూడా తొలగించడం జరిగిందని,జిల్లాలో కరోనా వైరస్ వ్యాపించకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో కాలేశ్వరం ప్రాజెక్టు ఎస్ ఇ రమణారెడ్డి, భూపాలపల్లి ఆర్డీవో వైవి గణేష్, మహాదేవపూర్ ఎంపీపీ రాణి భాయి, కాలేశ్వరం ఎంపిటిసి మమత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More Press News