బస్తీ దవాఖానాలు ఉ.9 నుండి సా. 4 గంటల వరకు పని చేస్తాయి: మంత్రి ఈటెల రాజేందర్
- మల్లాపూర్ డివిజన్ ఎస్ వి నగర్ లో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్
- పాల్గొన్న మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ డా.యోగితా రాణా
హైదరాబాద్ నగరాన్ని వైరస్ భారి నుండి కాపాడుకున్నాము. ముంబై, ధానే, పూణే నగరాలలో నెలకొన్న పరిస్థితులను అర్ధం చేసుకోండి.. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి... మాకేమి అవుతుందులే అనే నిర్లక్ష్యం వద్దు... మీ కుటుంబం, మీతోటి వారు, సమాజం గురించి ఆలోచించండి అని చెప్పారు. బస్తీ దవాఖానాలలో పైసా ఖర్చు లేకుండా వైద్య సేవలు అందుతాయని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవలను పెంచనున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు బస్తీ దవాఖానాలు తెరిచి వుంటాయని తెలిపారు. కార్పొరేటర్లు, కాలనీ వాసులు బస్తీ దవాఖానాల నిర్వహణలో భాగస్వాములు కావాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.