వెయ్యి వెంటిలేటర్ లు కావాలని కేంద్రాన్ని కోరాం: ఈటలరాజేందర్
- కరోనా మహమ్మారినీ అడ్డుకట్ట వేయడానికి, చికిత్స అందించడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం
- 100 వెంటిలేటర్స్ ను ప్రభుత్వ ఆసుపత్రులకు డొనేట్ చేసిన మైక్రాన్ ఫౌండేషన్ వారికి ధన్యవాదములు
ఈ రోజు BRKR భవన్ లో అమెరికన్ ఇండియా ఫౌండేషన్, గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైక్రాన్ సంస్థ వంద వెంటిలేటర్స్ ను మంత్రి ఈటల రాజేందర్ కి అందించారు. 80 వెంటిలేటర్స్ గాంధీ ఆసుపత్రికి, 10 ఉస్మానియా ఆసుపత్రికి, 10 చెస్ట్ హాస్పిటల్ కి అందించారు. మరో వంద వెంటిలేటర్స్ కూడా అందిస్తామని గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చిన్నబాబు తెలిపారు. వీటితో పాటు 5000 PPE కిట్స్, 5000 N-95 మాస్క్ లు కూడా అందించారు. ఈ కార్యక్రమంలో మైక్రాన్ డైరెక్టర్ రాధిక, మేనేజర్ మురళి, అమెరికన్ ఇండియా ఫౌండేషన్ స్టేట్ ప్రోగ్రామ్ మెనేజేర్ వినయ్ సనం, గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ dr చినబాబు, కిరణ్, గాంధీ ఆసుపత్రి సూపింటెండెంట్ డాక్టర్ రాజారావు పాల్గొన్నారు. వీరికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.