ఫోటో జర్నలిస్టు రాజమౌళి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- జర్నలిస్టులకు అండగా తెలంగాణ సర్కార్
- సిఎం కెసిఆర్ చేసినంతగా ఎవరూ చేయలేదు
- ఫోటో జర్నలిస్టు రాజమౌళి నిరాడంబర జీవి
- ఆయన కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం
- రాజమౌళి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
అనంతరం మంత్రి మాట్లాడుతూ, జనం కోసం పాటు పడే జర్నలిస్టులు వారి వ్యక్తిగత జీవితం, సొంత కుటుంబాల గురించి కూడా ఆలోచించాలన్నారు. పిల్లల భవిష్యత్తు గురించి కొంత సమయం కేటాయించాలని సూచించారు. ప్రభుత్వం జర్నలిస్టుల కోసం మరే రాష్ట్రంలో లేని విధంగా ఆలోచిస్తున్నదన్నారు. సిఎం కెసిఆర్ జర్నలిస్టుల కోసం ప్రత్యేక నిధిని కేటాయించారని, ప్రెస్ అకాడమీ పేరున ఆ నిధిని ఉంచారన్నారు. మరణించిన కుటుంబాలను, వారి పిల్లలను ఆదుకోవడానికి, చదువుల కోసం ఆ నిధిని ఖర్చు చేస్తున్నారన్నారు. జర్నలిస్టులందరినీ సమంగా చూస్తున్న ప్రభుత్వం కూడా ఇదేనన్నారు. అయితే, రాజమౌళి నిరాడంబర జీవి అని, తనకు చాలా కాలంగా రాజమౌళి తెలుసన్నారు. రాజమౌళి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చెప్పారు.