నిర్మాణ రంగ వలస కార్మికుల ఉపాధి కల్పన కోసం ప్రత్యేక వెబ్ సైట్.. ప్రారంభించిన తెలంగాణ మంత్రి!

  • నిరుద్యోగ యువతకు,కార్మికులకు వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణ ఇవ్వాలి
  • ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వివిధ నిర్మాణ రంగ సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి
  • తెలంగాణలో మానవ వనరుల అవసరం చాలా ఉంది
  • నిరుద్యోగులకు, ఉద్యోగ కల్పనకు తోడ్పడే నిర్మాణ రంగం సంస్థలకు సమన్వయంగా NAC ఉంటుంది
హైదరాబాద్: తెలంగాణకు చెందిన నిర్మాణ రంగ వలస కార్మికుల ఉపాధి కల్పన కోసం NAC రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్ ను ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి కార్యాలయంలో ఆర్ అండ్ బి శాఖ మంత్రి మరియు NAC వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, NAC డిజి భిక్షపతి, ఆర్ అండ్ బి ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

స్వరాష్ట్రానికి వచ్చిన తెలంగాణ నిర్మాణ రంగ వలస కార్మికుల నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి:

కరోనా సృష్టించిన సంక్షోభం నేపథ్యంలో నిర్మాణ రంగంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు (స్కిల్డ్, అన్ స్కిల్డ్ లేబర్) గల్ఫ్ దేశాలు మరియు ముంబాయి, సూరత్  తదితర రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. ఇలా స్వరాష్ట్రానికి తిరిగి వచ్చే కార్మికులకు ప్రైవేటు నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలను కల్పించి వారిని అదుకొనేందుకు మరియు నిర్మాణ రంగంలో ఏర్పడబోయే కార్మికుల కొరతను తీర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు NAC (న్యాక్) ద్వారా తెలంగాణ వలస కార్మికుల సంబంధిత సమాచారం సేకరించి వారిని రాష్ట్రంలోని ప్రెవేటు నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.

తెలంగాణ కు చెందిన వివిధ దేశాల నుంచి మరియు మన దేశంలో వివిధ రాష్ట్రాల నంచి స్వరాష్ట్రానికి వచ్చే నిర్మాణ కార్మికులు వారి సమాచారాన్ని https://tsnac.cgg.gov.in,సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కలిగిస్తుంది. పై వెబ్ సైట్లో నమోదు చేసుకున్న సమాచారాన్ని, తెలంగాణ రాష్ట్ర నిర్మాణ రంగ అసోషియన్స్ BAI, CREDAI, TREDA, TBF, IGBC ద్వారా ప్రైవేట్ నిర్మాణ సంస్థలకు అందిస్తుంది.తద్వార, ఆ సంస్థల అవసరాల మేరకు నమోదు చేసుకున్న కార్మికులకు ఉపాధి అవకాశం ఉంటుంది.

వెబ్సైట్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గల్ఫ్ దేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తెలంగాణ వలస కార్మికుల కోసం రూపొందించిన ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్ కు రూపకల్పన చేసిన NAC డిజి, సిబ్బందికి నా శుభాకాంక్షలు. ఈ వెబ్సైట్ కచ్చితంగా విజయవంతం అవుతుంది. కోవిడ్-19 వల్ల ఉత్పన్నమైన ఇప్పటి పరిస్థితులు, రాబోయే పరిస్థితులు బేరీజు వేసుకొని ముందుకెళ్లాలి. కోవిడ్-19 నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి తిరిగివచ్చిన మన వలస కార్మికులు ఈ వెబ్సైట్ లో వారి వివరాలు నమోదు చేసుకోవచ్చు. దాని ద్వారా NAC వారి వివరాలు తెలంగాణ రాష్ట్ర నిర్మాణ రంగం అసోసియేషన్ ద్వారా ప్రైవేట్ నిర్మాణ రంగం సంస్థలకు అందిస్తుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో NAC ముఖ్య భూమిక పోషించాలి. నిరుద్యోగ యువతకు,కార్మికులకు వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వివిధ నిర్మాణ రంగ సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. తెలంగాణలో మానవ వనరుల అవసరం చాలా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ వెతుక్కోవాలి, ఉద్యోగం ఎలా సంపాదించాలి అనే సరైన అవగాహన లేక ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ వెబ్సైట్ వారికి ఓ మార్గం చూపిస్తుంది. NAC వెబ్సైట్ లో నా పేరు నా పేరు నమోదు చేసుకుంటే అయితే వివిధ సంస్థల వద్ద నా పేరు ఉంటుంది నా అర్హతలకు తగ్గ ఉద్యోగం లభిస్తుంది అనే అవేర్ నెస్ వస్తుంది.

NAC తో అసోసియేట్ అయిన నాలుగు నిర్మాణ రంగం సంస్థలకు వారి వివరాలు అందిస్తుంది. ఉద్యోగం ఇచ్చే వాళ్లకు, ఉద్యోగం కావాలి అనుకునే వాళ్లకు NAC సమన్వయం చేస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన యాప్ రూపొందిస్తాం. నిరుద్యోగులకు, ఉద్యోగ కల్పనకు తోడ్పడే నిర్మాణ రంగం సంస్థల కు సమన్వయంగా NAC ఉంటుంది" అని మంత్రి అన్నారు.

చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. "తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ రంగంలో చాలా మంది లేబర్ అవసరం. యాప్ కూడా రూపొందిస్తే అందరికి త్వరగా చేరుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంది. ముఖ్యమంత్రి నిర్ణయాలతో వారు తిరిగి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. న్యాక్ మంచి ప్రయత్నం చేసింది వారికి నా అభినందనలు" అని సీఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో BAI, క్రెడాయ్, ట్రెడా, TBF, IGBC నిర్మాణ రంగం ప్రతినిధులు పాల్గొని పలు సూచనలు చేసారు.

More Press News