పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ప్రముఖుల నివాళి!

జాతీయపతాక రూపశిల్పి పింగళి వెంకయ్య సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం- ఏపీ సీఎం జగన్

భారతదేశానికి జాతీయపతాకాన్ని అందించిన గౌరవం తెలుగువారికి దక్కించిన మహనీయులు పింగళి వెంకయ్యగారు. వందేమాతరం, హోమ్‌రూల్ వంటి ఉద్యమాలలో పింగళిగారి పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శనీయం. ఈ రోజు పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా ఆ దేశభక్తుని స్మృతికి నివాళులర్పిద్దాం - చంద్రబాబు

దేశ సమగ్రతను, జాతీయవాదాన్ని ప్రపంచానికి తెలిపిన మువ్వన్నెల భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన శ్రీ పింగళి వెంకయ్య గారు తెలుగువారు కావడం మనకు గర్వకారణం. ఆయన జయంతి సందర్భంగా జనసేన తరపున ఘననివాళి అర్పిస్తున్నాం- పవన్ కల్యాణ్

స్వాతంత్ర్య సమర యోధుడు మన భారత దేశ జండా ను రూపొందించినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. దేశం గర్వించదగ్గ వ్యక్తి వెంకయ్యగారు,  ఆయన మన తెలుగు వారు కావడం మనందరికీ ఇంకా గర్వకారణం- వైవీ సుబ్బారెడ్డి

తెలుగువెలుగు, జాతీయపతాక రూపకర్త, స్వాతంత్య్ర పోరాటధీరులైన పింగళి వెంకయ్యగారు వ్యవసాయ, భూగర్భ శాస్త్ర పరిశోధనలలో సైతం ఎంతో కృషిచేశారు. స్వాతంత్య్రం వచ్చాక ఖనిజ పరిశోధకశాఖ సలహాదారుగా దేశానికి సేవలందించారు. ఈరోజు పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని దేశసేవను స్మరించుకుందాం- నారా లోకేశ్

భారత జాతీయ పతాక రూపకర్త, స్వతంత్ర సమరయోధులు, తెలుగు బిడ్డ శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు- సీఎం రమేశ్

ఏ జాతికైనా తన ఉనికిని చాటడానికి ఒక సంకేతం కావాలి. అదే జాతీయ పతాకం. ఒక జాతి ఆత్మగౌరవ ప్రతీక జాతీయ జెండా. అలాంటి పతాకాన్ని మన భారత జాతికి అందించిన మన తెలుగు బిడ్డ శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు- గంటా శ్రీనివాస రావు

More Press News