కరోనా కష్ట కాలంలోనూ పిల్లలకు ఉచితంగా పుస్తకాలు: మంత్రి ఎర్రబెల్లి
- టీసాట్ ద్వారా సాటిలైట్ తరగతులు
- విద్యా సంవత్సరం వృథా కాకుండా ప్రభుత్వం ప్రయత్నాలు
- సిఎం కెసిఆర్ గారి ఆదేశానుసారం ఈ నెలాఖరులోగా విద్యార్థులందరికీ ప్రభుత్వ పుస్తకాల పంపిణీ
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కరోనా విపత్తులో ప్రపంచమంతా కొట్టుకుపోతుఉన్నదన్నారు. ఈ దశలోనూ అటు ప్రజల సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని ఆపకుండా అపర చాణక్యుడిలా సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారన్నారు. రైతు బంధు, 24 గంటల విద్యుత్, సాగునీరు, రుణ మాఫీ, రైతుల పంటల కొనుగోలు వంటి అనేక పథకాలను మంత్రి వివరించారు. ఇదే కోవలో రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఈ విద్యా సంవత్సరం వృథా కాకుండా ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే టీ సాట్ ద్వారా విద్యార్థులకు సాటిలైట్ ద్వారా పాఠాలు కూడా చెబుతున్నట్లు మంత్రి చెప్పారు. కరోని విస్తరిస్తున్న తరుణంలో పిల్లలకు పాఠ్య పుస్తకాల పంపిణీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అలాగే విద్యార్థులు కూడా ప్రభుత్వం అందిస్తున్న పాఠ్య పుస్తకాలను ఎప్పటికప్పుడు చదువుకుంటూ అప్ డేట్ కావాలని బోధించారు. ప్రజలు గుంపులుగా ఉండే పరిస్థితి లేదని, ఈ తరుణంలో విద్యార్థులను ఒకే చోట కూర్చోబెట్టి చదువులు చెప్పే పరిస్థితులు కూడా లేకుండా పోయాయన్నారు. అందుకే ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉండడానికి వీలుగా ప్రభుత్వం అన్నిచర్యలు చేపడుతున్నదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 29790 స్కూల్స్ లో 26,37,257 మంది విద్యార్థులకు కోటి, 50లక్షల 92వేల 454 పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3,917 స్కూల్స్ లో 2,68,311 మంది విద్యార్థులకు 15,17,591 పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా 533 స్కూల్స్ లో 59,733 మంది విద్యార్థులకు 3,40,390 పాఠ్య పుస్తకాలను, వరంగల్ రూరల్ జిల్లా వ్యాప్తంగా 786 స్కూల్స్ లో 51,313 మంది విద్యార్థులకు 2,42,185 పాఠ్య పుస్తకాలను, జనగామ జిల్లా వ్యాప్తంగా 559 స్కూల్స్ లో 35,748 మంది విద్యార్థులకు 2,52,393 పాఠ్య పుస్తకాలను, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 1076 స్కూల్స్ లో 64,686 మంది విద్యార్థులకు 3,64,743 పాఠ్య పుస్తకాలను, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 468 స్కూల్స్ లో 28,7804 మంది విద్యార్థులకు 1,54,000 పాఠ్య పుస్తకాలను, ములుగు జిల్లా వ్యాప్తంగా 495 స్కూల్స్ లో 28,027 మంది విద్యార్థులకు 1,63,880 పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, సహకరించాలని, సాటిలైట్ తరగతులు వినాలని, సాధ్యమైనంత త్వరలోనే కరోనా పరిస్థితులను బట్టి, అడ్మిషన్లు, తరుగతులు నిర్వహిస్తామని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.