టీసీఎల్ నుంచి సరికొత్త శ్రేణి '4కే AI ఆండ్రాయిడ్ పీ9.0' టీవీ!
- TCL నుంచి కొత్త శ్రేణి P8 సిరీస్ ద్వారా భారతదేశపు మొట్టమొదటి అత్యాధునిక AI ఫంక్షన్‌తో కూడిన 4K AI ఆండ్రాయిడ్ P 9.0 టీవీ; సాధారణ AI TV కంటే మరింత శక్తిమంతమైనది
- P8 సిరీస్ టీవీ అనేది భారతదేశపు మొట్టమొదటి 4K AI ఆండ్రాయిడ్ పై (9.0) టీవీగా అత్యాధునిక AI ఫీచర్లు అందించనుందిప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా, స్మార్ట్ అప్లయన్సెస్‌తో కలిపి లైవ్ డెమోకి ఆతిధ్యమివ్వనున్న TCL
ప్రపంచపు టాప్-2 టీవీ కార్పోరేషన్‌గా ఉన్న TCL ఇప్పుడు సరికొత్త మరియు వినూత్న శ్రేణి 4K AI టీవీలతో వచ్చేందుకు సిద్ధమైంది. ఇవి అత్యాధునిక గూగుల్-సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ పై (9.0)తో పనిచేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భారతీయ వినియోగదారులు టీవీ చూసే అనుభవాన్ని సమూలంగా మార్చేయనుంది. 2019, ఆగస్ట్ 2వ తేదీన న్యూఢిల్లీలోని ITC మౌర్యలో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమంలో TCL తన P8S, P8E & P8లను ఆవిష్కరించనుంది.
P8S సిరీస్‌లో 65” మరియు 55” వేరియెంట్లు మరియు P8E సిరీస్‌లో 55”, 50”, మరియు 43” వేరియెంట్లు, P8లో 43”, 50” 55” సైజుల్లో ఈ టీవీలు లభించనున్నాయి. మొట్టమొదటిసారిగా ఈ తరహా విశిష్టలతో వస్తోన్న ఈ టీవీలు అత్యద్భుతమైన గాడ్జెట్ రూపంలో వినియోగదారులకు హ్యాండ్స్-ఫ్రీ టీవీ కంట్రోల్ అనుభవాన్ని అందించనున్నాయి. అంతే కాకుండా స్మార్ట్ ఫ్యాన్, రోబోట్ స్వీపర్స్, కర్టెన్లు, లైట్లు మొదలైన స్మార్ట్ హోమ్ డివైజ్‌లను కూడా ఈ సందర్భంగా వినియోగదారుల ముందుకు తీసుకురానున్నారు. P8S అనేది ప్రతిష్టాత్మక మోడల్‌గా రావడంతో పాటు భారతదేశంలో ఒక బేజెల్-లెస్ ఫుల్-స్క్రీన్ డిజైన్‌తో పాటు మెటాలిక్ ఫ్రేమ్‌తో ఆకట్టుకోనున్నాయి. P8 మోడల్ ప్రారంభ ధర రూ. 27990/-, P8E మోడల్ ప్రారంభ ధర రూ. 29990/-, P8S శ్రేణి రూ. 44990/- నుంచి మొదలవుతాయి.
గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ సర్టిఫికేట్ కలిగిన ఈ తాజా LED UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ DTV అనేది సింపుల్ వాయిస్ కంట్రోల్‌తో అత్యద్భుత అనుభవాన్ని అందించడం కోసం AIని ఉపయోగిస్తుంది. అలాగే, AI ఆధారితమైన ఈ లేటెస్ట్ టీవీ అనేది రిమోట్ కంట్రోల్ అవసరం లేకుండా ఒక గాడ్జెట్ లాగా నిరంతరాయంగా పనిచేస్తుంది. AI ఫెయిర్‌ఫీల్డ్ సాంకేతికత ద్వారా, సంవృద్ధమైన ఇమేజ్ మరియు సౌండ్ ఇంజనీరింగ్‌తో ఈ టీవీ తన వినియోగదారులకు అత్యంత గొప్ప టీవీ చూసే అనుభవం అందిస్తుంది. అదనంగా, స్పోర్ట్స్ మోడ్ ఫీచర్‌తో ఆన్-గోయింగ్ మ్యాచ్ దృశ్యాన్ని సంవృద్ధం చేయడం ద్వారా అత్యంత డైనమిక్ మరియు ఎడ్జీ స్పోర్ట్స్ చూస్తున్న అనుభవం అందిస్తుంది.
డిజిటల్ అవగాహన కలిగిన వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, TCL తీసుకొచ్చిన ఈ తాజా టీవీలో నెట్‌ఫ్లిక్స్ మరియు యూట్యూబ్ లాంటివన్నీ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా పరిశ్రమ అగ్రగాములుగా ఉన్న హాట్‌స్టార్, యుప్‌టీవీ, వూట్, ఆల్ట్ బాలాజీ, మరియు ఇంకా అనేక సంస్థలతో భాగస్వామ్యం ద్వారా TCL అందించే ఖరీదైన గ్యాలరీని సైతం వినియోగదారులు అందుకోవచ్చు.
ఈ పూర్తి శ్రేణి 4K AI ఆండ్రాయిడ్ టీవీలనేవి భారతదేశంలోని వినోదరంగం భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఎందుకంటే, AI సాంకేతికత మరియు ఆండ్రాయిడ్ పై (9.0) స్మార్ట్ టీవీల్లో అత్యద్భుతమైన ఆవిష్కరణలుగా తెరమీదకొస్తున్నాయి. AI ఆల్గారిథమ్ ద్వారా ఇవి అత్యద్భుతమైన పిక్చర్ మరియు సౌండ్ క్వాలిటీ అందిస్తాయి. భారత మార్కెట్ మీద TCL బ్రాండ్ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో, ఈ బ్రాండ్ హౌస్ నుంచి ఈ సిరీస్ వినియోగదారుల ముందుకొస్తోంది. స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్ విభాగంలో ఈ బ్రాండ్ స్థానాన్ని ఇది మరింత పటిష్టం చేయనుంది. 38 సంవత్సరాల వారసత్వం కలిగిన TCL తన భారతీయ వినియోగదారులకు అత్యాధునిక ఆవిష్కరణలు అందించడం ద్వారా వారి జీవితాన్ని స్మార్ట్ గా మరియు సులభంగా మార్చే లక్ష్యంతో ముందుకెళ్తోంది. TCL నుంచి స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్ టెక్నాలజీ ద్వారా రానున్న రోజుల్లో ఇలాంటి ఆవిష్కరణలెన్నో తెరమీదకు రానున్నాయి.
ఈ టీవీల ఆవిష్కరణ సందర్భంగా, TCL తన వినియోగదారుల కోసం లైవ్-డెమో సెషన్లు నిర్వహించనుంది. తద్వారా, AIతో పనిచేసే వాయిస్ కంట్రోల్స్ తో టీవీని మాత్రమే కాకుండా ఇతర స్మార్ట్ హోమ్ ఉపకరణాలను ఎలా పనిచేయించవచ్చో ప్రదర్శించనుంది. అంతేకాకుండా, ఈ ప్రారంభోత్సవంలో భాగంగా P8E మరియు P8S సిరీస్ పూర్తి శ్రేణిని అందుబాటులోకి తేవడంతో పాటు ఇలాంటి ఆవిష్కరణలు మరెన్నింటినో పరిచయం చేయనున్నారు.
తాజా అభివృద్ధి గురించి TCL ఇండియా – మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ మైక్ చెన్ మాట్లాడుతూ, “భారతదేశపు వినియోగదారుల కోసం P8 సిరీస్‌ను అధికారికంగా ప్రారంభిస్తుండడం మాకెంతో ఆనందంగా ఉంది. మా తాజా సిరీస్ అనేది భారతదేశంలోని స్మార్ట్ హోమ్ ఉపకరణాల విభాగంలోనే కాకుండా స్మార్ట్ టీవీల విభాగంలోనూ ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభించనున్నాయి. ఈ విభాగంలో నెలకున్న యథాతథ స్థితి దాటి ముందుకు వెళ్లడం కోసం మేము కృత్రిమ మేథస్సులోని సరికొత్త ఆవిష్కరణలను వినియోగించాము. తద్వారా, మా వినియోగదారులకు ఒక పరిపూర్ణ మరియు నిరంతరాయ అనుభవం అందించడానికి సిద్ధమయ్యాం. అలాగే, మా వినియోగదారుల కోసం లైవ్-డెమో అందించడానికి కూడా మేము ఆతృతగా ఎదురుచూస్తున్నాము. 4K AIతో పనిచేసే ఒక స్మార్ట్ టీవీ ఏవిధంగా ఒక స్మార్ట్ హోమ్ గాడ్జెట్‌గా మారిపోయిందో చూపించడం ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్ డివైజ్‌లను వాయిస్ కమాండ్ల ద్వారా ఎలా పనిచేయించవచ్చో ప్రదర్శించనున్నాము. తాజా ఉత్పత్తుల ఆవిష్కరణతో మా వినియోగదారులకు నిరంతరాయ అనుభవాన్ని అందించడానికి మేము ఉద్విగ్నభరితంగా ఎదురు చూస్తున్నాము. అలాగే, మా వినియోగదారుల స్మార్ట్ మరియు వినూత్న జీవితానికి ఉపయోగపడే ఇలాంటి మరెన్నో ఆశ్చర్యాలను రానున్న రోజుల్లోనూ అందించనున్నాం” అన్నారు.
వినియోగదారులు స్మార్ట్ గా మరియు తెలివిగా జీవించడం కోసం భారత మార్కెట్లోకి వినూత్న మరియు అందుబాటు ధరలో పరిష్కారాలు అందించడమనే TCL వారి నిబద్ధతకు సంకేతంగా ఈ తాజా ఉత్పత్తిని తీసుకొస్తున్నారు. ఈ బ్రాండ్ ఇప్పటికే భారతదేశ మార్కెట్లో ఏసీ, వాషింగ్ మెషిన్, రెఫ్రిజిరేటర్లను ఆవిష్కరించింది. ఇండియా-ఫస్ట్ అనే ధోరణితో ముందుకెళ్తున్న ఈ బ్రాండ్ దేశ ప్రజల హృదయాలు గెల్చుకోవడం కోసం ఐపిఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ ను స్పాన్సర్ చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జెయింట్ ప్యానెల్ ఫ్యాక్టరీ ప్రారంభించింది. దీనిద్వారా ఈ బ్రాండ్ తన వినూత్న ఉత్పత్తుల తయారీతో పాటు 8,000 మందికి ఉద్యోగాలు కూడా కల్పిస్తోంది.
దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే భారతదేశంలోని ప్రముఖ సంస్థల మధ్యలో ఒకానొక అగ్రగామిగా TCL అవతరించింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, 2018లో టీవీల అమ్మకాల్లో భారత మార్కెట్లో TCL ఐదవ ర్యాంక్ సాధించింది. కృత్రిమ మేథస్సు మరియు IoTలో పరిశ్రమ-అగ్రగామి ఆధునికతలతో నిండిన ఉత్పత్తులు కలిగిన TCL అనేది విభిన్న విభాగాల్లో భారీ ఉపకరణాల కోసం వినియోగదారు మెచ్చే ఒక బ్రాండ్‌గా ఉంటోంది. ప్రస్తుతం తీసుకొస్తున్న ఈ తాజా ఆవిష్కరణతో దేశంలోని ఈ విభాగంలో ఒక అగ్రగామిగా TCL స్థానం మరింత పటిష్టం కానుంది.
TCL ఎలక్ట్రానిక్స్ గురించి:
చైనాలో ప్రధాన కార్యాలయం కలిగిన TCL ఎలక్ట్రానిక్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (HKSE స్టాక్ కోడ్: 01070) అనేది ప్రపంచ టీవీ పరిశ్రమలోని అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉంటోంది. అలాగే, కన్జూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశోధన మరియు అభివృద్ధి, తయారీ మరియు పంపిణీలోనూ సత్తా చాటుతోంది. “AI + IoT”తో కూడిన “డబుల్ +” వ్యూహం మరియు “ఉత్పత్తులు + సర్వీసులు” ప్రధాన లక్ష్యంగా కొత్త ఉత్పత్తి-మరియు-వినియోగదారు కేంద్రిత వ్యాపార నమూనాతో TCL ఎలక్ట్రానిక్స్ అనేది స్మార్ట్ టీవీలు, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఏసీ, సౌండ్ బార్ లాంటి స్మార్ట్ ఉత్పత్తులు మరియు సర్వీసులతో వినియోగదారులకు అద్వితీయ అనుభవం అందించడం ద్వారా ఒక సమగ్ర పర్యావరణం నిర్మించే దిశగా ప్రయాణిస్తోంది. 2018లో, TCLను నం.2 గ్లోబల్ టీవీ కార్పోరేషన్‌గా IHS ప్రకటించింది.