డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

  • వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం రాయపర్తి, వేంకటేశ్వర పల్లె, కేశవపురం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలి అన్నదే సీఎం కేసిఆర్ సంకల్పమ‌ని, అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను ప్ర‌భుత్వ‌మే క‌ట్టించి, పేద‌ల‌కు పంపిణీ చేస్తున్న‌ద‌ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం రాయపర్తి, వేంకటేశ్వర పల్లె, కేశవపురం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను గురువారం మంత్రి ప్రారంభించారు.

రాయ‌ప‌ర్తిలో 50మందికి, కేషవపురం లో 30మందికి, వేంకటేశ్వర పల్లె లో 10 మందికి ఇండ్లను ప్రారంభించి అప్ప‌గించారు. ల‌బ్ధిదారుల‌తో సంతోషాన్ని పంచుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, గ‌త ప్ర‌భుత్వాల‌కు భిన్నంగా ఏదో ఓ ఇంటికి ఇంత డ‌బ్బు, మెటీరియ‌ల్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా, ప్ర‌భుత్వం పేద‌ల ఆత్మ‌గౌర‌వం పెంచే విధంగా డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు క‌ట్టించింద‌న్నారు. అనేక వ‌డ‌పోత‌ల త‌ర్వాత నిజ‌మైన అర్హులైన ల‌బ్ధ‌దారులను ఎంపిక చేస్తున్న‌ట్లు, వారు కూడా ఎక్కువ మంది ఉన్న చోట లాట‌రీ తీస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. కాగా, ఇంకా ఇండ్లు అవ‌స‌ర‌మైన నిరుపేద‌లుంటే, వారికి స్థ‌లాలుంటే, అందులో ఇండ్లు క‌ట్టుకోవ‌డానికి ప్ర‌భుత్వం ఆర్థిక స‌హాయం చేసే ఆలోచ‌న కూడా చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. కొంత ఆలస్యంగా అయినప్పటికీ, డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించడం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

లబ్ధిదారుల తో కలిసి ఇండ్ల ప్రవేశం చేయడం, పాలు పొంగించడం అనందంగా ఉంది. మిగతా గ్రామాల్లో ఇండ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభిస్తామ‌ని మంత్రి తెలిపారు. ప్రభుత్వం బలహీన వర్గాలకు అండగా ఉన్నది. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తున్నది. ప్రజలు కూడా పని చేసే ప్రభుత్వాలకు అండగా నిలవాలి అని మంత్రి ఎర్ర‌బెల్లి కోరారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి తో కలిసి ఇండ్ల లబ్ధిదారులు సంతోషంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశా‌రు. ఈ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ హరిత, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

More Press News